Video Viral: పెళ్లిలో నోరు తుడుచుకోవడానికి సరికొత్త టిష్యు కనిపెట్టిన అతిథి.. చూస్తే పడిపడి నవ్వుతారంతే

|

May 04, 2022 | 10:22 AM

Funny Video Viral: భారత దేశంలో (India) పెళ్లిళ్లు అంటేనే సరదా సందడి. ఇక పెళ్లిళ్ల సీజన్ వస్తే చాలు.. రకరకాల సన్నివేశాలతో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో(Social Media) హల్ చల్..

Video Viral: పెళ్లిలో నోరు తుడుచుకోవడానికి సరికొత్త టిష్యు కనిపెట్టిన అతిథి.. చూస్తే పడిపడి నవ్వుతారంతే
Funny Video Viral
Follow us on

Funny Video Viral: భారత దేశంలో (India) పెళ్లిళ్లు అంటేనే సరదా సందడి. ఇక పెళ్లిళ్ల సీజన్ వస్తే చాలు.. రకరకాల సన్నివేశాలతో ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో(Social Media) హల్ చల్ చేస్తుంటాయి. పెళ్లిళ్ల సీజన్ కొందరికి ఆనందాన్ని పంచుతుంది.  కొంతమంది పెళ్లిళ్లకు వెళ్లాలంటే చాలా ఉత్సాహంగా ఉంటారు. ఎందుకంటే మంచి తిండి, రకరకాల తినుబండారాలు ఉంటాయి. అంతేకాదు ఆటలు పాటలతో సందడి చేస్తారు. కొంతమంది తమలో ఉన్న స్కిల్స్‌ని బయటకు తీసి పదిమంది ముందు ప్రదర్శిస్తూ.. సందడి వాతావరణం సృష్టించే సీజన్‌ ఇది. పెళ్లి వేడుకలలో అతిముఖ్యమైన వ్యవహారం ఆహారం. తమ వివాహాలలో ఫుడ్ మెనూలో చాలా వస్తువులను చేరుస్తూ తమ హోదాని కూడా ప్రదర్శిస్తారు కూడా. చాలా మంది పెళ్లి వేడుకలకు వెళ్ళేది.. రకరాల ఫుడ్ ఐటెమ్స్ ను తినడం కోసమే అని కూడా చెప్పవచ్చు. తాజాగా ఫుడ్‌కి సంబంధించిన చాలా ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు నవ్వుకుంటారు.

వాస్తవానికి.. ఈ వీడియోలో వేడుకలో భాగంగా భోజనాలు ఏర్పాటు చేశారు. అక్కడ టేబుల్‌పై కొంతమంది ఆహారం తింటున్నారు. ఆ బంతిలో పెద్దలతో పాటు కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. ఒక వ్యక్తి ఆహారం తింటూ ఉన్నాడు. ఇంతలో నోరు తుడుచుకోవాలనుకున్నట్లున్నాడు.. అటుఇటు చూసి.. అక్కడ ప్లేట్ లో ఉన్న రోటీని తీసుకుని టిష్యూ పేపర్‌గా ఉపయోగిస్తూ.. నోరు తుడుచుకున్న తర్వాత విసిరాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు చూసి జనాలు ఓ రేంజ్ లో  నవ్వుకుంటారు.

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లోensen4947 అనే IDతో  షేర్ చేశారు. ఇప్పటివరకు 16 లక్షల వ్యూస్, 12 వేల లైక్స్  ను సొంతం చేసుకుంది. కొత్త టిష్యూ పేపర్ అని కొందరు అంటే.. మరొక వినియోగదారు ‘ఇది సరైనది గురూ’ అంటూ కామెంట్ చేశారు.

మరిన్ని వైరల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: 

Viral Video: మంటపుట్టిస్తున్న ఎండలు.. స్టౌ లేకుండా ఎండలో ఆమ్లెట్ వేసుకుంటున్న యువకుడు.. వీడియో వైరల్

Lunar Eclipse 2022: ఈ నెల 16న ఈ ఏడాదిలో ఫస్ట్ చంద్రగ్రహణం.. దీని ప్రభావం ఏఏ దేశాలపై ఉండనున్నదంటే

Bay Leaves Benefits: బిర్యానీ ఆకు ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..