భిన్నత్వంలో ఏకత్వం మన దేశం సొంతం.. మసీదుల నుంచి వస్తున్న ముస్లింలపై హిందువులు పూల వర్షం..

ప్రపంచంలో విభిన్న వాతావరణం కనిపించే దేశం భారత దేశం. ఇక్కడ కుల మతాలకు అతీతంగా ప్రజలు జీవిస్తారు. భారతీయులం అందరం ఒక్కటే అని సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా ప్రపంచానికి చాటి చెబుతూ ఉంటారు. అందుకు ఉదాహరణగా నిలిస్తుంది రంజాన్ సందర్భంగా చోటు చేసుకున్న ఒక సంఘటన. ఈ రోజు ముస్లింలు పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండగ. ఈ రోజు ముస్లింలు మసీదులో ప్రార్ధనలు చేసి వస్తుండగా.. వారిపై హిందువులు పువ్వుల వర్షం కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొదుతున్నాయి.

భిన్నత్వంలో ఏకత్వం మన దేశం సొంతం.. మసీదుల నుంచి వస్తున్న ముస్లింలపై హిందువులు పూల వర్షం..
Hindus Shower Flowers On Muslims

Updated on: Mar 31, 2025 | 8:10 PM

ఈద్-అల్-ఫితర్ సందర్భంగా భారతదేశంలో మతసామరస్యానికి ప్రతీకగా కొన్ని సంఘటనలు నిలిచాయి. దేశంలో అనేక నగరాలు హిందూ, ముస్లిం సాంస్కృతిక సంప్రదాయాల సామరస్య సమ్మేళనాన్ని ప్రదర్శించాయి. ఇరు వర్గాల ప్రజలు ఐక్యత, ఆనందంతో పండుగను జరుపుకున్నారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జామా మసీదు, ఈద్గా వద్ద ప్రార్థనలు చేసిన తర్వాత ముస్లింలపై హిందువులు పూల వర్షం కురిపించారు. దీంతో అక్కడ వాతావరణం సంతోషంతో నిండిపోయింది.

ప్రముఖ వార్తా పత్రిక నివేదిక ప్రకారం చీఫ్ ఖాజీ ఖలీద్ ఉస్మానీ ప్రార్థనలకు నాయకత్వం వహించారు. స్థానిక హిందువులు ప్రార్ధనలు ముగించి మసీదు నుంచి తిరిగి వస్తున్న ముస్లింలపై పూల వర్షం కురిపించారు. ప్రార్థనల తర్వాత ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

అందమైన వీడియోపై ఓ లుక్ వేయండి..


ప్రయాగ్‌రాజ్‌లో కూడా ఇలాంటి దృశ్యమే కనిపించింది. అక్కడ సామాజిక సంస్థలు, హింవులు నమాజ్ చేసిన తర్వాత మసీదుల నుంచి బయటకు వచ్చే ముస్లింలపై గులాబీ రేకుల వర్షం కురిపించారు. కిలోల కొద్దీ గులాబీ రేకులతో వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజియా సుల్తాన్.. ప్రయాగ్‌రాజ్ ఎల్లప్పుడూ “గంగా-జమున తెహజీబ్” (హిందూ ముస్లిం సంస్కృతుల కలయికను సూచించే ఒక పదం)ను ప్రోత్సహించే నగరంగా ఉందని వ్యాఖ్యానించారు.

ప్రయాగ్ రాజ్ లో మాత్రమే కాదు హర్దోయ్ జిల్లాలోని సాండి పట్టణంలో మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు రాంజీ గుప్తా సమక్షంలో, ఈద్ ఊరేగింపులో పాల్గొన్న ముస్లింలపై హిందువులు పూల వర్షం కురిపించారు. ఢిల్లీలోని సీలంపూర్ లో కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోల ద్వారాతెలుస్తోంది.

వారణాసి, సంభాల్‌లలో కూడా ఈ సంప్రదాయం కొనసాగింది. అక్కడ మసీదులో ప్రార్ధనలు చేసి తిరిగి వస్తున్న ముస్లింలకు పూలతో స్వాగతం పలికారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..