Viral Video: అడవి రాజు సింహంతో గద్ద యుద్ధం.. చివరకు గెలిచింది ఎవరో తెలిస్తే..

దాంతో ఆ గద్దల గుంపు సింహంపైనే దాడి చేస్తున్న వీడియో ఇది. గద్దలు సింహం వీపుపై ఎక్కి దాన్ని కొరుకుతాయి. సింహం కూడా కోపంగా గర్జిస్తుంది. గద్దల గుంపు సింహం గర్జనను కూడా లెక్కచేయవు. అవి సింహాన్ని వదలకుండా దాడి చేస్తాయి. గద్దలు సింహాన్ని కదలడానికి కూడా సమయం ఇవ్వకుండా దాడి చేస్తాయి.

Viral Video: అడవి రాజు సింహంతో గద్ద యుద్ధం.. చివరకు గెలిచింది ఎవరో తెలిస్తే..
Eagle Fighting With Lion

Updated on: Jun 15, 2025 | 3:32 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వీడియోల్లో జంతువులు, పక్షులు, పాములకు సంబంధించినవి కూడా అనేకం ఉన్నాయి. అలాగే, కొన్నిసార్లు అడవిలో పెద్ద పెద్ద జంతువుల మధ్య జరిగే పోరాటాలు కూడా నెట్టింట వైరల్‌ అవుతుంటాయి. కొన్నిసార్లు కొన్ని పక్షులు కూడా పెద్ద జీవులతో పోరాడటం కనిపిస్తుంది. సింహాలు, పులులు, చిరుతలు, ఏనుగులు వంటి వివిధ జంతువులతో కూడా పక్షులు పోరాడిన సందర్భాలు చూస్తుంటాం. అలాంటి వీడియోలు ప్రజల్ని ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. అలాంటిదే ఇక్కడ కూడా ఒక సింహం, గద్దతో పోరాడుతున్న దృశ్యం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షాక్‌ అవుతున్నారు.

సింహాన్ని అడవికి రాజు అంటారు. సింహం గర్జన కొన్ని కిలోమీటర్ల వరకు వినబడుతుంది. సింహాన్ని చూసి చాలా జంతువులు, పక్షులు భయంతో పారిపోతాయి. సింహం ఇతర జంతువులను వేటాడటం చూడటం సర్వసాధారణం. కానీ ఒక పక్షి సింహాన్ని వేటాడుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఈ వీడియోలో ఒక గద్ద సింహాన్ని వేటాడుతోంది. సింహం, గద్ద మధ్య భీకర పోరాటం జరుగుతుంది.

అడవిలో ఒక పెద్ద సింహంపై కొన్ని గద్దలు దాడి చేశాయి. అడవిలో సింహం చంపిన ఆహారాన్ని తినడానికి గద్దలు వచ్చాయి. అప్పుడు సింహం ఆ గద్దలను తరిమికొట్టడానికి ప్రయత్నిస్తుంది. దాంతో ఆ గద్దల గుంపు సింహంపైనే దాడి చేస్తున్న వీడియో ఇది. గద్దలు సింహం వీపుపై ఎక్కి దాన్ని కొరుకుతాయి. సింహం కూడా కోపంగా గర్జిస్తుంది. గద్దల గుంపు సింహం గర్జనను కూడా లెక్కచేయవు. అవి సింహాన్ని వదలకుండా దాడి చేస్తాయి. గద్దలు సింహాన్ని కదలడానికి కూడా సమయం ఇవ్వకుండా దాడి చేస్తాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ సంఘటన ఎక్కడ జరిగిందనే దానిపై ఎటువంటి సమాచారం లేదు. కానీ గద్దలు సింహంపై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు దీనిని షాకింగ్‌గా భావిస్తుండగా, మరికొందరు ఇది AI వీడియో అయి ఉండవచ్చని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంమీద, ఈ వీడియో వైరల్ అవుతోంది. ఇది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..