Drunk Man Video: ఫుల్ గా మందు తాగిన ఇద్దరు మిత్రులు.. బైక్ ఎక్కేందుకు నానా తిప్పలు పడ్డ మందుబాబు.. ఫన్నీ వీడియో వైరల్

|

Nov 19, 2022 | 3:36 PM

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు స్నేహితులు బైక్‌పైన స్థానిక మద్యం షాపుకి వెళ్లి మందు సేవించారు. వాళ్లు మందు తాగడం పూర్తయ్యాక ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి బైక్‌ నడిపేందుకు సిద్ధమయ్యాడు.

Drunk Man Video: ఫుల్ గా మందు తాగిన ఇద్దరు మిత్రులు.. బైక్ ఎక్కేందుకు నానా తిప్పలు పడ్డ మందుబాబు.. ఫన్నీ వీడియో వైరల్
Drunken Mens Viral Video
Follow us on

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం.. ఇది కేవలం ఒక ప్రకటనలా మాత్రమే కనిపిస్తుంది.. తప్ప దాన్ని ఎవరూ పట్టించుకోరు. ఇక నుంచి మందు ముట్టం.. కంట్రోల్‌.. కంట్రోల్‌ అంటూనే కంట్రోల్‌ తప్పుతుంటారు మందుబాబులు. అంతేకాదు మందు తాగి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం.. కానీ దానిని పట్టించుకునే మందుబాబులు అతి తక్కువ మందే. తాగి బైక్స్, కార్లు నడుపుతూ..  డ్రంక్ డ్రైవ్ లో తరచుగా మందుబాబు ట్రాఫిక్ పోలీసులకు చిక్కుతూ ఉంటారు. అక్కడ కొందమంది చేసే రచ్చ రచ్చ గురించి తరచుగా వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. అయితే తాజాగా ఓ  ఇద్దరు మందుబాబులకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పడి పడి నవ్వుతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు స్నేహితులు బైక్‌పైన స్థానిక మద్యం షాపుకి వెళ్లి మందు సేవించారు. వాళ్లు మందు తాగడం పూర్తయ్యాక ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి బైక్‌ నడిపేందుకు సిద్ధమయ్యాడు. అతను బాగానే బైక్‌ పైన కూర్చున్నాడు. బండి స్టార్ట్‌ చేసి తన మిత్రుడ్ని బైక్‌ ఎక్కమన్నాడు. ఇక మనోడికి కిక్కు బాగా ఎక్కడంతో నానాపాట్లు పడుతూ బైక్ వద్దకు వచ్చాడు. అనంతరం బైక్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. కానీ అతనివల్ల కాలేదు. అటూ ఇటూ తూలుతూ కింద పడిపోయాడు. మళ్లీ లేచి వెళ్లి బండి ఎక్కుదామని ట్రై చేసాడు.

ఇవి కూడా చదవండి

ఫన్నీ వీడియోపై ఓ లుక్ వేయండి.

 

కిందామీదా పడి ఎట్టకేలకు బైక్ ఎక్కేశాడు. అంతే బైక్‌ రైడ్‌చేయడానికి రెడీగా ఉన్న వ్యక్తి అదుపు తప్పాడు. . దీంతో బైక్‌తో సహా ఇద్దరూ కింద పడిపోయారు. ఈ దృశ్యాలు అన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వాటిని ఎవరో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను వేలాదిమంది నెటిజన్లు వీక్షిస్తూ రకరకాల ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..