సైకోను మించి ఉన్నవ్ భయ్యా.. పాములను న్యూడుల్స్ లెక్క నమిలేశాడు.. వీడి కథ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..

పాము కనిపిస్తేనే కాళ్లు, చేతులు వణికిపోతాయి.. అమ్మో పాము అంటూ ఆమడదూరం పరుగెడతాం.. కానీ ఒక వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. కరవబోయిన పామును పట్టుకుని, కరకర నమిలేశాడు. అలా ఒక్కటి కాదు ఏకంగా మూడు పాములను.. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సైకోను మించి ఉన్నవ్ భయ్యా.. పాములను న్యూడుల్స్ లెక్క నమిలేశాడు.. వీడి కథ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
Man Chews Snake Alive In Jharkhand

Updated on: Jul 07, 2026 | 9:49 AM

పాము కనిపిస్తేనే జనాలు ఆమడదూరం పరుగెడతారు. అలాంటిది తనను కరవబోయిన పామును పట్టుకుని కరకర నమిలేశాడు ఒక వ్యక్తి. అంతటితో ఆగకుండా వరుసగా మరో రెండు పాములను కూడా నోట్లో వేసుకోబోయాడు. జార్ఖండ్‌లోని చత్రా జిల్లా కుండా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్వాడిహ్ టోలా గ్రామంలో జరిగిన ఈ విచిత్ర సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 46 ఏళ్ల బుధన్ భారతి శనివారం తన స్నేహితులతో కలిసి పొలాల వద్ద మద్యం సేవిస్తూ పేకాట ఆడుతున్నాడు. అదే సమయంలో పొదల్లోంచి వచ్చిన ఒక పాము అతడిని కాటు వేయడానికి ప్రయత్నించింది. సాధారణంగా అయితే ఎవరైనా భయపడతారు. కానీ అప్పటికే విపరీతమైన మద్యం మత్తులో ఉన్న బుధన్.. ఆ పామును చేత్తో పట్టుకుని నమిలి పడేశాడు. చుట్టుపక్కల వారు ఆపడానికి ప్రయత్నించినప్పటికీ వినకుండా దాన్ని తినేశాడు.

మరో పామును వెతికి మరీ..

మొదటి పామును తిన్న తర్వాత బుధన్ మళ్లీ పొలాల్లోకి పరుగెత్తి, మరో పామును పట్టుకుని దాన్ని కూడా నమిలి మింగేశాడు. ఆ తర్వాత మళ్లీ మద్యం తాగాడు. అంతటితో ఆగకుండా మూడో పామును కూడా పట్టుకుని తినబోతుండగా.. విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బలవంతంగా అడ్డుకున్నారు. గ్రామస్తుల సమాచారం ప్రకారం.. అతను తిన్న వాటిలో ఒక పాము బతికే ఉందని, మరొక పామును గ్రామస్తులు చంపి పడేశారని తెలుస్తోంది.

ఆసుపత్రిలో చికిత్స.. బాధితుడి వింత ప్రకటన..

ఈ క్రేజీ స్టంట్ తర్వాత బుధన్ భారతి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ప్రతాప్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. అయితే ఈ ఘటనపై బుధన్‌ను ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘ప్రజల మనసుల్లోంచి పాముల భయాన్ని పోగొట్టడానికే గ్రామస్తుల ముందే పామును తిన్నాను. చాలా దేశాల్లో పాములను ఇష్టంగా తింటారని విన్నాను. అందుకే కేవలం సరదా కోసం తిన్నాను. ఇప్పుడు నేను క్షేమంగానే ఉన్నాను’’ అని బుధన్ తెలిపాడు. విషపూరితమైన పాములను తాకడం, తినడం ప్రాణాంతకమని, ఒక్క కాటు వేసినా ప్రాణాలు పోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Follow Us