వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. సీసీటీవీలో దొరికిపోయిన తాగుబోతు వ్యాపారి! ఏం చెబుతున్నాడంటే..

వందే భారత్ రైళ్లు ప్రారంభమైనప్పటి నుండి దేశంలోని వివిధ ప్రాంతాలలో తరచూ రాళ్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. రైల్వే శాఖ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, అవగాహన కల్పించినా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరోసారి లక్ష్యంగా మారింది. మహారాష్ట్రలోని కల్యాణ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వ్యక్తి వందే భారత్ రైలుపై రాళ్లు రువ్విన ఘటన సంచలనం సృష్టించింది. ఈ మొత్తం దృశ్యం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో నిందితుడిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. సీసీటీవీలో దొరికిపోయిన తాగుబోతు వ్యాపారి! ఏం చెబుతున్నాడంటే..
Stone Pelting On Vande Bharat

Updated on: Mar 15, 2026 | 8:43 AM

దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరోసారి లక్ష్యంగా మారింది. మహారాష్ట్రలోని కల్యాణ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వ్యక్తి వందే భారత్ రైలుపై రాళ్లు రువ్విన ఘటన సంచలనం సృష్టించింది. అయితే, నిందితుడి అతి తెలివి సీసీటీవీ కెమెరా ముందు సాగలేదు. నిందితుడు కల్యాణ్ ప్రాంతంలో పాత సామాన్లు కొనుగోలు చేసే వ్యక్తిగా గుర్తించారు. ఘటన సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రైలు ట్రాక్ పక్కన నిలబడి ఉన్న అతను, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వేగంగా వెళ్తుండగా అకస్మాత్తుగా ఒక రాయిని రైలు వైపు విసిరాడు. ఈ దాడిలో రైలులోని ఒక కిటికీ అద్దం పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు.

రైల్వే పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా, నిందితుడు రాయి విసురుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఆ ఆధారంతో రైల్వే రక్షణ దళం (RPF), స్థానిక పోలీసులు గాలింపు చేపట్టి అతన్ని అరెస్ట్ చేశారు. విచారణలో అతను మద్యం మత్తులో ఆ పని చేసినట్లు అంగీకరించాడు. నిందితుడిపై రైల్వే చట్టం సెక్షన్ 154 (ప్రయాణికుల భద్రతకు ముప్పు కలిగించడం) కింద కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

వందే భారత్ రైళ్లు ప్రారంభమైనప్పటి నుండి దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇలాంటి రాళ్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. రైల్వే శాఖ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, అవగాహన కల్పించినా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం నేరమని, దీనికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని అధికారులు మరోసారి స్పష్టం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us