Viral: నడుచుకుంటూ వస్తున్నాడు.. పోలీసులను చూసి ఒక్కసారిగా స్లో అయ్యాడు.. వెళ్లి చెక్ చేయగా

అలా రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న బాటసారి.. దగ్గర్లో పోలీసులు కనిపించడం చూసి ఒక్కసారిగా తత్తరపాటుకు లోనయ్యాడు. వెంటనే స్లో అయ్యాడు. దీంతో అతడ్ని గమనించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం తనిఖీ చేయగా ఏం లభించలేదు. అయితే అతని వద్ద వాటర్ బాటిల్.....

Viral: నడుచుకుంటూ వస్తున్నాడు.. పోలీసులను చూసి ఒక్కసారిగా స్లో అయ్యాడు.. వెళ్లి చెక్ చేయగా
Police

Updated on: Oct 08, 2025 | 6:37 PM

మొహాలీ జిల్లాలోని ఖరార్‌లో డ్రగ్స్‌తో ఉన్న ఓ వ్యక్తి ఆశ్చర్యకర రీతిలో పోలీసులకు చిక్కాడు. అక్కడి క్రిస్టియన్ స్కూల్ సమీపంలో స్టెయిన్‌లెస్ స్టీల్ వాటర్ బాటిల్‌లో చాకచక్యంగా దాచిపెట్టిన 100 గ్రాముల హెరాయిన్‌తో అతడు పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడు ఆ ప్రాంతానికి కాలి నడకన నడుచుకుంటూ వస్తున్నాడు. పోలీసులు సమీప ప్రాంతంలో ఉండటాన్ని చూసి.. అకస్మాత్తుగా వెనక్కి తగ్గాడు. అతడి మీద అనుమానం కలగడంతో.. వెంటనే SI గురుప్రతాప్ సింగ్ ఆపి తనిఖీ చేశాడు. అయితే అతని వద్ద ఏం లభించలేదు. అయితే సదరు వ్యక్తి ఉన్న వాటర్ బాటిల్‌పైకి పోలీసుల దృష్టి మళ్లింది. దాన్ని తీసుకుని పూర్తిగా తనిఖీ చేయగా.. వాటర్ బాటిల్ అడుగున హెరాయిన్ ఉండటం గమనించిన పోలీసులు షాక్ అయ్యారు.

నిందితుడిని ఫిరోజ్‌పూర్ నివాసి అయిన కల్నల్ సింగ్ కుమారుడు హర్జిత్ సింగ్ అలియాస్ హ్యారీ (34) గా గుర్తించారు. హర్జిత్ గతంలో ఫిరోజ్‌పూర్ నుంచి మొహాలీకి హెరాయిన్ అక్రమ రవాణా చేస్తుండగా పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. ఎన్‌డిపిఎస్ చట్టంలోని సెక్షన్లు 21, 29 కింద అతనిపై ఇప్పటికే ఫేజ్-8 మొహాలీ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. తాజాగా సిటీ ఖరార్ పోలీస్ స్టేషన్‌లో NDPS చట్టంలోని సెక్షన్ 21 కింద కొత్త కేసు నమోదు చేశారు. ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి రవాణా చేస్తూ.. వీరి నెట్‌వర్క్ చైయిన్ ఏంటి అన్న దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. నిందితుడిని మంగళవారం కోర్టు ముందు హాజరుపరిచి, పోలీసు రిమాండ్ పూర్తయిన తర్వాత జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడక క్లిక్ చేయండి..