
సోషల్ మీడియాలో కొన్నిసార్లు వింత వీడియోలు కనిపిస్తాయి. అవి చూస్తే నవ్వు ఆగదు. ప్రస్తుతం అలాంటి ఒక వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఒక కోడి, 13 ఏళ్ల కుర్రాడిపై దాడి చేసి అతడిని భయపెట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఫన్నీ పోరాటం చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఆ కోడి పదేపదే ఆ కుర్రాడిపై దాడి చేయడం ఈ వీడియోలో చూడొచ్చు. దీంతో భయపడిని బాలుడు నేలపై పడిపోయి కోడిని తన్నడానికి ప్రయత్నించాడు. అయితే కోడి మాత్రం వెనక్కి తగ్గకుండా, అతడిపై మళ్లీ మళ్లీ దాడి చేస్తూనే ఉంది. దాంతో కుర్రాడు నిస్సహాయంగా ఉండిపోయాడు.
ఈ పోరాటం ఇలా కొనసాగుతుండగా.. ఒక కుక్క అనూహ్యంగా రంగంలోకి దిగింది. అది ఏ మాత్రం ఆలోచించకుండా, కోడిపై దాడి చేయడం మొదలుపెట్టింది. కుక్క వెంటపడటంతో కోడి తన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోవాల్సి వచ్చింది. దాంతో ఆ కుర్రాడు ఊపిరి పీల్చుకున్నాడు. ఆ కుక్క ఆ బాలుడి పెంపుడు కుక్క అని తెలుస్తోంది.
ఈ ఫన్నీ వీడియో ట్విట్టర్‌లో @NatureChapter అనే యూజర్ షేర్ చేశారు. 11 సెకన్ల ఈ వీడియోను ఇప్పటికే 2 లక్షల మందికి పైగా చూశారు. వందలాది మంది దీనిని లైక్ చేసి,ఫన్నీ కామెంట్లు పెట్టారు. ఒక యూజర్ ఆ కోడి పిల్లవాడి కంటే ధైర్యంగా ఉంది అని కామెంట్ చేయగా.. మరొకరు “ఆ కుక్క రక్షించడానికి రాకపోతే ఈరోజు కోడి హీరో అయ్యేది’’ అని కామెంట్ చేశారు. కష్ట సమయంలో తన యజమానిని రక్షించిన ఆ కుక్కను చాలామంది ప్రశంసించారు. పెంపుడు జంతువులు తమ యజమానులకు ఎంత అండగా ఉంటాయో ఈ సంఘటన మరోసారి నిరూపించిందని అభిప్రాయపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
— Nature Chapter (@NatureChapter) September 17, 2025
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..