Viral: 12 ఏళ్ల బాలుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఆస్పత్రిలో CT స్కాన్ తీసిన వైద్యులు షాక్

12 ఏళ్ల బాలుడు తల్లిదండ్రులతో ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పాడు. సరిగ్గా శ్వాస కూడా అందడం లేదని వాపోయాడు. తల్లిదండ్రుల వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. పరిస్థితి మెరుగుపడకపోగా ఇంకా దిగజారింది. దీంతో మరో పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ టెస్టులు చేయగా...

Viral: 12 ఏళ్ల బాలుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఆస్పత్రిలో CT స్కాన్ తీసిన వైద్యులు షాక్
Doctors (Representative image)

Updated on: May 28, 2025 | 10:01 AM

కోల్‌కతా మెడికల్ కాలేజ్ హాస్పిటల్ (MCHK)లో వైద్యులు 12 ఏళ్ల బాలుడి ఊపిరితిత్తుల నుంచి ఒక బోర్డు పిన్‌ను విజయవంతంగా తొలగించారు. ఆ పిన్ ఊపిరితిత్తుల బృంకుసంలో గడచిన ఐదు రోజులుగా ఉండటంతో.. లోపల కూడా గాయమైంది గాయాన్ని కలిగించింది. ప్రస్తుతం బాలుడు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు. 48 గంటలు గడిస్తే అతని పరిస్థితి స్థిమిత పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

తల్లిదండ్రుల తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడు నాలుగు రోజులుగా శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఛాతీలో నొప్పి ఉందని తల్లిదండ్రులకు చెప్పాడు. మొదట స్థానిక స్వరూప్‌నగర్‌లోని వైద్యుల వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించినా ఫలితం కనబడలేదు. పరిస్థితి విషయంగా ఉండటంతో సోమవారం రాత్రి బసిర్‌హాట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కు తరలించారు. బసిర్‌హాట్ హాస్పిటల్‌లో ఎక్స్‌రే తీసిన వైద్యులు ఊపిరితిత్తులలో ఓ వస్తువు ఉందని గుర్తించారు. దీంతో బాలుడిని మెరుగైన చికిత్స కోసం కోల్‌కతాలోని మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ బాలుడి పరిస్థితి అంచనా వేసిన డాక్టర్లు.. CT స్కాన్ తీసి.. బోర్డు పిన్ బ్రాంకస్‌లో లోతుగా ఉండటాన్ని గుర్తించారు.

ENT విభాగంలోని అసోసియేట్ ప్రొఫెసర్ దీపాంశు ముఖర్జీ నేతృత్వంలో, ఎక్స్‌పర్ట్ మెడికల్ టీమ్ శస్త్రచికిత్స చేసింది. బ్రోంకోస్కోప్, ఆప్టికల్ ఫోర్సెప్స్ ఉపయోగించి పిన్‌ను తొలగించారు.పిన్ ప్లాస్టిక్ తోకతో ఉండటం వల్ల తొలగించడంలో కాస్త సవాళ్లు ఎదురయ్యాయి. పిన్ వల్ల ఊపిరితిత్తి ఒక భాగం పూర్తిగా పని చేయకుండా పోయింది. తీవ్ర రక్తస్రావం ఎదురైంది. శస్త్రచికిత్స మొత్తం రెండు గంటలపాటు కొనసాగింది. అనంతరం బాలుడిని ప్రొఫెసర్ మిహిర్ సర్కార్ పర్యవేక్షణలోని PICU కి తరలించారు. ప్రస్తుతం బాలుడు వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉన్నాడు. తదుపరి 48 గంటలు కీలకం అని వైద్యులు తెలియజేశారు.

Board Pin

బాలుడు బోర్డు పిన్ ఎలా మింగాడో తమకు తెలియదని తల్లిదండ్రులు చెబుతున్నారు. చిన్న పిల్లలు చిన్న చిన్న వస్తువులను అనుకోకుండా నోటి ద్వారా మింగే అవకాశం ఉంటుంది. కాబట్టి, అటువంటి వస్తువులను పిల్లల దరిదాపుల్లో ఉంచకుండా జాగ్రత్తపడాలని నిపునఉలు సూచిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఛాతీ నొప్పి వంటి లక్షణాలను లైట్ తీసుకోకకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యవసరం. ఈ సంఘటనలో వైద్యుల నైపుణ్యం వల్ల బాలుడి ప్రాణాలు నిలిచాయి. ఒకవేళ ముందుగా డాక్టర్ల వద్దకు తీసుకెళ్లకపోయి ఉంటే, ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉండేది. కాబట్టి, పిల్లల ఆరోగ్యం విషయంలో అలక్ష్యం అస్సలు పనికిరాదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.