Viral: ఏడాదిగా తీవ్రమైన కడుపునొప్పి.. భరించలేక ఆస్పత్రికెళ్లిన మహిళ.. డాక్టర్లు ఎక్స్‌రే తీయగా.!

|

Jun 26, 2023 | 1:30 PM

గడిచిన ఏడాది కాలంగా ఓ మహిళ కడుపునొప్పితో బాధపడింది. ఎన్ని మందులు వాడినా.. నొప్పి నుంచి ఉపశమనం పొందలేదు. చివరికి.!

Viral: ఏడాదిగా తీవ్రమైన కడుపునొప్పి.. భరించలేక ఆస్పత్రికెళ్లిన మహిళ.. డాక్టర్లు ఎక్స్‌రే తీయగా.!
Doctors
Follow us on

గడిచిన ఏడాది కాలంగా ఓ మహిళ కడుపునొప్పితో బాధపడింది. ఎన్ని మందులు వాడినా.. నొప్పి నుంచి ఉపశమనం పొందలేదు. చివరికి ఓ ఆసుపత్రిలో చేరి.. ఎక్స్‌రే తీయించుకోగా.. అసలు విషయం బయటపడింది. తన కడుపులో ఉన్న వస్తువును చూసి బిత్తరపోయింది. ఈ ఘటన 2001వ సంవత్సరంలో ఆస్ట్రేలియాలో జరిగింది. ఇంతకీ అసలేం జరిగిందంటే.?

వివరాల్లోకి వెళ్తే.. 2001లో సిడ్నీ నగరానికి చెందిన పాట్ స్కిన్నర్ అనే మహిళకు వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. కడుపునొప్పి కారణంతో ఆమె ఈ ఆపరేషన్ చేయించుకోగా.. నొప్పి తగ్గకపోగా.. మరింత ఎక్కువైంది. దీంతో ఏడాదిగా నరకం అనుభవించింది. చివరికి స్థానిక ఆసుపత్రికి వెళ్లి.. మళ్లీ ఎక్స్‌రే తీయించుకున్నారు.

ఆ ఎక్స్‌రేలో మహిళ కడుపులో ఏడు అంగుళాల సర్జికల్ కత్తెర ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఆపరేషన్ చేసిన సమయంలో డాక్టర్లు ఆమె కడుపులో కత్తెర పెట్టి మర్చిపోయినట్లు గుర్తించారు. అదృష్టవశాత్తు ఏడాది పాటు ఆ కత్తెర ఆమె కడుపులో ఉన్నా.. ఎలాంటి ఇన్ఫెక్షన్ అవ్వలేదని వైద్యులు చెప్పారు. కాగా, మరో శస్త్రచికిత్స నిర్వహించి కత్తెరను బయటికి తీశారు. అటు ఈ ఉదంతం మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.