
ఒక వ్యక్తి స్కూటీని రివర్స్ తీస్తూ ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న డ్రెయిన్‌లో పడిపోయిన ఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. అతను డ్రెయిన్‌లో పడిపోవడాన్ని గమనించిన కొందరు స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని అతన్ని బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. గురువారం ఉదయం ఢిల్లీలోని వైభవ్ ఖండ్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఖోడా సుభాష్ పార్క్ ప్రాంతంలో సంతోష్ యాదవ్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో పాటు నివసిస్తున్నాడు. అయితే పిల్లలు బర్గర్ కావాలని అడగడంతో తీసుకువచ్చేందుకు సంతోష్ ఇందిరాపురంలోని గౌర్ గ్రీన్ సొసైటీ ఉన్న షాప్‌కి వెళ్లాడు. అక్కడ బర్గర్లు కొన్న తర్వాత తిరిగి ఇంటికి వెళ్లేందుకు తన స్కూటర్‌ను రివర్స్ చేశాడు.
అయితే ఆ వెనకాలే డ్రెయిన్ ఓపెన్ చేసి ఉండడాన్ని సంతోష్ గమనించలేదు. దీంతో అతను స్కూటీ వెనక్కి తీస్తున్న క్రమంలో వెనక టైర్ అమాంతం డ్రెయిన్ గుంతలో జారుకుంది. దీంతో సంతోష్ స్కూటర్‌తో సహా ఆ డ్రెయిన్ గుంతలో పడిపోయాడు. అయితే ఆ గుంత ఎక్కవ లోతుగా ఉండడంతో అతను బయటకు వచ్చేందుకు కుదరలేదు. అది గమనించిన కొందరు స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని అతన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు.
చేతితో లాగేందుకు రాకపోవడంతో పక్కనే ఉన్న ఒక నిచ్చెన తీసుకొచ్చి అతని అందించారు. దీంతో సంతోష్ నిచ్చెన పట్టుకొని పైకి ఎక్కాడు. తర్వాత తాళ్ల సహాయంతో తన వాహనాన్ని కూడా బయటకు తీశారు. అయితే ఈ ప్రమాదంలో సంతోష్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వీడియో చూడండి..
From Ghaziabad, Uttar Pradesh.
A young man on scooty fell into an open drain. The kids on the spot raised alert and the victim driver was rescued by onlookers using a ladder. pic.twitter.com/FP4sBk7xcP
— Piyush Rai (@Benarasiyaa) August 28, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.