GK: భారతదేశానికి కేవలం ఒక్క రోజు మాత్రమే రాజధానిగా ఉన్న నగరం ఏదో తెలుసా?

భారతదేశ రాజధాని అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది న్యూఢిల్లీ. కానీ, ఢిల్లీకి ముందు మన దేశ రాజధానిగా ఉన్న నగరం ఏదో మీకు తెలుసా? ఆ నగరం కేవలం ఒక్క రోజు మాత్రమే మన దేశానికి రాజధానిగా ఉందన్న విషయం తెలుసా? అయితే కచ్చితంగా మీరు దీనికి గురించి తెలుసుకోవాల్సిందే. కాబట్టి ఢిల్లీ ముందు భారత రాజధాని ఏది, ఆ నగరాన్ని కేవలం ఒక్క రోజు మాత్రమే ఎందుకు కొనసాగించారు. ఆ తర్వాత ఎందుకు మార్చారో తెలుసుకుందాం.

GK: భారతదేశానికి కేవలం ఒక్క రోజు మాత్రమే రాజధానిగా ఉన్న నగరం ఏదో  తెలుసా?
India's One Day Capital

Updated on: May 12, 2026 | 7:22 AM

భారతదేశ రాజధాని అనగానే ప్రస్తుతం అందిరికి వెంటనే గుర్తుకు వచ్చేది న్యూఢిల్లీ. కానీ, భారత చరిత్ర పుటలలో కేవలం ఒక్క రోజు మాత్రమే రాజధానిగా వెలిగిపోయిన నగరం అలహాబాద్ ప్రస్తుత ప్రయాగ్‌రాజ్ గురించి మీకు తెలుసా? 1858 నవంబర్ 1న, అలహాబాద్‌లోని మింటో పార్క్‌లో ఒక అద్భుతమైన వేడుక జరిగింది. ఈ సందర్భంగా భారతదేశ పరిపాలన ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి నేరుగా బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ చేస్తున్నట్టు ఓ చారిత్రాత్మక ప్రకటన వెలువడింది. ఆ సమయంలోనే భారత రాజధానిగా నాటి అలహాబాద్‌( ప్రస్తుత ప్రయాగ్‌రాజ్‌ను) దేశ రాజధానిగా ప్రకటిచింది.

అలహాబాద్‌నే ఎందుకు ఎంచుకున్నారు?

అయితే నాడు భారత రాజధానిగా అలహాబాద్‌ను ఎంచుకోవడం వెనుక బలమైన రాజకీయ, పరిపాలనా కారణాలు ఉన్నాయి. ఆ సమయంలో, అలహాబాద్ వాయువ్య ప్రావిన్సులకు రాజధానిగా ఉండేది దానికి తోడు గంగా, యమునా నదుల సంగమ స్థానంలో ఉండటం వల్ల రవాణా, కమ్యూనికేషన్ సౌకర్యాలు బాగుండేవి. దీంతో 1857 తిరుగుబాటు సమయంలో ఢిల్లీ, కోల్‌కతా కంటే అలహాబాద్‌ను బ్రిటీష్ వారు సురక్షితమైన ఆ పరిపాలనా కేంద్రంగా భావించారు. అందుకే అలహాబాద్‌ను ఒక రోజు పాటు భారత రాజధానిగా ప్రకటించారు. ఆ తర్వాత దేశరాజధానిగా ఢిల్లీని ప్రకటించారు.

ఎందుకు ఒక్కరోజు మాత్రమే 

ఆ సమయంలో ఢిల్లీ ఇంకా తిరుగుబాటు గాయాల నుంచి కోలుకోలేదు. కలకత్తా ప్రధాన కేంద్రమైనప్పటికీ, ఉత్తర భారత దేశంపై పట్టు సాధించడానికి మరియు తిరుగుబాటును అణచివేయడానికి అలహాబాద్ బ్రిటీష్ సైన్యానికి ప్రధాన స్థావరంగా  ఉంది. అందుకే ఆ ఒక్క రోజు కార్యక్రమానికి దాన్ని వేదికగా ఎంచుకున్నారు.

ఇంత అరుదైన రాజధాని హోదా ఉన్నప్పటికీ, అలహాబాద్ ఒక ముఖ్యమైన రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా నిలిచింది. ఎందుకంటే భారత జాతీయ కాంగ్రెస్‌కు సంబంధించి అనేక కీలక సమావేశాలు ఇక్కడే జరిగాయి. మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి భారతదేశంలోని ప్రముఖ నాయకులకు ఇది నివాసంగా ఉండేది. నేటికీ ప్రయాగ్‌రాజ్‌లో పర్యాటకులు, చరిత్రకారులు ఈ ఒక రోజు రాజధాని కథనాన్ని ఎంతో గర్వంగా స్మరించుకుంటారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us