టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైపోవడంతో చాలామంది తమలోని ప్రతిభను వెలికి తీస్తున్నారు. అక్కర్లేని వస్తువులతో అద్భుత ఇన్వెన్షన్లు చేసి వీక్షకులను భలేగా ఆకట్టుకుంటాయి. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దానిని చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ‘వావ్’ అనాల్సిందే. సాధారణంగా బైక్‌పై ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణం చేస్తారు. అయితే ఇక్కడ ఏకంగా ఎనిమిది మంది ఒకే బైక్‌పై ప్రయాణించారు.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ బైక్ రైడర్.. తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను ఓ అటోలా మార్చాడు. బైక్‌కు 10 అడుగుల పొడవాటి ఆటో సీట్ లాంటిది అమర్చి ఏకంగా 7గురిని కూర్చోపెట్టుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ వీడియోను ‘memewalanews’ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ అప్లోడ్ చేయగా.. నెటిజన్లు లైకులు, ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘ఆటో ఖర్చు మిగిల్చాడురా బాబు’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఇలాంటి బైక్‌ను ఇప్పటిదాకా చూడలేదు’ అంటూ మరొకరు కామెంట్ పెట్టారు. లేట్ ఎందుకు మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
Also Read:
చిరునవ్వులతో ముద్దులొలికే ఈ చిన్నారి వరుస హిట్స్‌తో దూసుకుపోతోంది.. ఎవరో గుర్తుపట్టారా.!
మూవీ లవర్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఈ నెలలో ఓటీటీ రిలీజ్లు ఇవే.. లిస్టులో బడా సినిమాలు!