Viral Video: బంగారం పూత పూసిన మిఠాయిలు.. కిలో ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఎక్కడంటే..

స్వీట్లంటే ఇష్టపడని వారుండరు. మన దేశంలో మిఠాయిలను అమితంగా ఇష్టపడే వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుందని

Viral Video: బంగారం పూత పూసిన మిఠాయిలు.. కిలో ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఎక్కడంటే..
Gold Sweet

Updated on: Jan 06, 2022 | 1:02 PM

స్వీట్లంటే ఇష్టపడని వారుండరు. మన దేశంలో మిఠాయిలను అమితంగా ఇష్టపడే వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. అందుకే ఇక్కడ అనేక రకాల స్వీట్స్ అందుబాటులో ఉంటాయి. వేరు వేరు ఫ్లేవర్స్‏తో ఎంతో రుచికరమైన అందమైన మిఠాయిలను తయారు చేస్తుంటారు. అయితే ఇప్పటివరకు మీరు కొన్ని స్వీట్స్ పై వెండి రేకు ఉండడం చూసే ఉంటారు. ఉదాహరణకు కాజూ కట్లీ. కానీ ఇప్పుడు సోషల్ మీడియా బంగారు పూత పూసిన మిఠాయిలు తెగ వైరల్ అవుతున్నాయి. ఏంటీ షాకయ్యారా ? కానీ మీరు చదివింది నిజమే. అక్షరాల బంగారంతో పూత పూసిన మిఠాయిల కోసం జనాలు అధిక సంఖ్యలో షాపు వద్దకు వెళ్తున్నారు. ఈ ఢిఫరెంట్ ఎక్కడో విదేశాల్లో అనుకంటే పొరబాటు పడినట్టే.. ఈ బంగారు పూత పూసిన మిఠాయిలు ఎక్కడో కాదండోయ్.. మన దేశంలోనే విక్రయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఢిల్లీలోని మౌజ్ పూర్ లో ఉన్న షాగూన్ స్వీట్స్ షాపులో ఈ బంగారు మిఠాయిలను విక్రయిస్తున్నారు. ఒక నిర్ధిష్టమైన స్వీట్ పై బంగారు పూత (గోల్డ్ ఫాయిల్‏తో) పూస్తున్న వీడియో ఇప్పుడు ఇన్‏స్టాలో చక్కర్లు కొడుతుంది. ఆ తర్వాత దానిపై కొంత కుంకుమ పువ్వును అందంగా అలంకరిస్తున్నారు. లేటేస్ట్ టాక్ ప్రకారం ఈ స్వీట్స్ కేజీ రేట్ రూ. 16,000. ఈ స్వీట్స్ వీడియోను ఫుడ్ బ్లాగర్ అర్జు్న్ చౌహన్ తన ఇన్‏స్టా ఖాతాలో షేర్ చేయగానే క్షణాల్లో వైరల్ అయ్యింది. ఇది చూసిన నెటిజన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. ఈ మిఠాయిని పెట్టుబడుల కోసం ఉపయోగించాలని ఒకరు కామెంట్ చేయగా.. ఇకపై తాము స్వీట్స్ తినమంటూ మరొకరు కామెంట్ చేశారు. మరీ ఈ గోల్డ్ స్వీ్ట్ తయారీ వీడియోను మీరు చూసేయ్యండి.

Also Read: Naa Peru Shiva 2: మరో సినిమాతో ప్రేక్షకుల ముందు రానున్న కార్తీ.. త్వరలో ప్రేక్షకుల ముందుకు” నాపేరు శివ 2″

Gali Janardhan Reddy Son: హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న గాలి జనార్దన్ రెడ్డి​ కొడుకు.. దర్శకుడు ఎవరంటే..

Rana Daggubati : మరో రీమేక్‌ను లైన్‌లో పెట్టనున్న దగ్గుబాటి హీరో.. శింబు సినిమా పై కన్నేసిన రానా..

 

Loading...
Unable to load recommendations.
Follow Us