కారు బ్యానెట్‌పై ఇద్దరు పోలీసులను ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌.. వరుసగా ఘటనలతో ఖాకీలకు షాక్‌..!

అయితే, అతడు కారు ఆపకపోగా వారిని బ్యానెట్‌పై ఈడ్చుకెళ్లాడు. ఈ షాకింగ్‌ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ డ్రైవర్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కారు బ్యానెట్‌పై ఇద్దరు పోలీసులను ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌.. వరుసగా ఘటనలతో ఖాకీలకు షాక్‌..!
Delhi Rash Driving

Updated on: Nov 03, 2024 | 3:51 PM

ఇద్దరు ట్రాఫిక్ పోలీసులను ఓ వ్యక్తి తన కారు బ్యానెట్‌పై లాక్కెల్లాడు. కారు నడుపుతూ..నిబంధనల్లు ఉల్లంఘించిన ఓ వ్యక్తిని పట్టుకోవడానికి ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. కానీ, అతడు కారు ఆపకుండా వెళ్లిపోతుండడంతో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు బ్యానెట్ దగ్గర ఉండి కారును ఆపే ప్రయత్నం చేశారు. అయితే, అతడు కారు ఆపకపోగా వారిని బ్యానెట్‌పై ఈడ్చుకెళ్లాడు. ఈ షాకింగ్‌ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ డ్రైవర్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో వాహనాన్ని ఆపాలని డ్రైవర్‌ను కోరారు. కానీ, అతడు కారు ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడని చెప్పారు. వీడియోలో ASI, ట్రాఫిక్ కానిస్టేబుల్ కారు బానెట్‌ను పట్టుకుని వేలాడుతుండగా, కారు డ్రైవర్‌ మాత్రం ఆపకుండా పారిపోయే ప్రయత్నం చేశాడు..చాలా దూరం వరకు అలాగే వారిని ఈడ్చుకెళ్లాడు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

&

గత 15 రోజుల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అక్కడున్న ఓ వ్యక్తి చిత్రీకరించి పోలీసులకు పంచాడు. సోషల్ మీడియాలో వీడియో అప్‌లోడ్‌చేసిన వెంటనే వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us