పక్కా స్కెచ్‌తో రంగంలోకి విజిలెన్స్‌.. లంచం సొమ్మును గాల్లోకి విసిరిన పోలీస్‌..! కట్‌చేస్తే..

లంచం నోట్లను గాల్లోకి విసిరి రోడ్డుపై చెల్లాచెదురుగా పడేసినప్పుడు, జనం ఆ నోట్లను పట్టుకోవడానికి పరుగులు తీశారు. 500నోట్లు దాదాపు వేల రూపాయలు దొరికాయి అక్కడి జనాలకు.  పోలీసుల విజిలెన్స్ బృందం 10 వేల రూపాయలు మాత్రమే సేకరించగలిగింది.  ఇది ఏ వెబ్ సిరీస్‌లోని దృశ్యం కాదు, కానీ ఈ సంఘటన మంగళవారం పాత ఢిల్లీలోని హౌజ్ ఖాజీ పోలీస్ స్టేషన్ వెలుపల రోడ్డుపై జరిగింది.

పక్కా స్కెచ్‌తో రంగంలోకి విజిలెన్స్‌.. లంచం సొమ్మును గాల్లోకి విసిరిన పోలీస్‌..! కట్‌చేస్తే..
Asi Throws Money Into Air

Updated on: Sep 10, 2025 | 6:08 PM

వాస్తవానికి ఏం జరిగిందంటే.. హౌజ్ ఖాజీ పోలీస్ స్టేషన్ ASIని లంచంతో పట్టుకోవడానికి విజిలెన్స్ యూనిట్ రంగంలోకి దిగింది. ఢిల్లీలో రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏఎస్‌ఐ రాకేశ్‌ శర్మ పట్టుబడ్డాడు. అధికారుల నుంచి తప్పించుకునేందుకు లంచం సొమ్మును ఆయన గాల్లోకి విసిరారు. రోడ్డుపై పడ్డ ఆ నోట్లను తీసుకోవడానికి జనం ఎగబడ్డారు. లంచం తీసుకుంటూ పట్టుబడటంతో పాటు, డబ్బును గాల్లోకి విసరడం చర్చనీయాంశంగా మారింది.

విజిలెన్స్ యూనిట్ డీసీపీ చెప్పిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 9న ఒక బాధితుడు విజిలెన్స్ బృందానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. బాధితుడు సీతా రామ్ బజార్ నివాసి. తన ఫిర్యాదులో హౌజ్ ఖాజీ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ASI రాకేష్ కుమార్ మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటలకు లంచం ఇవ్వడానికి తనను పోలీస్ స్టేషన్‌కు పిలిపించాడని ఆయన తెలిపారు. ఈ ఫిర్యాదుపై బృందం పక్కా ప్రణాళికతో అతన్ని పట్టుకునేందుకు వచ్చింది. మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో బాధితుడు హౌజ్ ఖాజీ పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించాడు.

కొంత సమయం తర్వాత బాధితుడు, నిందితుడు ASI రాకేష్ కుమార్ ఇద్దరూ పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చారు. ASI కి విజిలెన్స్ బృందం ఉన్నట్లు సూచన అందింది. దాంతో వెంటనే ఆ లంచం నోట్లను గాల్లోకి విసిరాడు. ఆ ప్రాంతంలో జనసమూహం ఎక్కువగా ఉండటంతో ఆ బృందం నిందితుడైన ASI ని పట్టుకుంది. కానీ, ఈలోగా చాలా మంది కొన్ని నోట్లను తీసుకొని పారిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..