Shocking Video: దాహం తీర్చుకుంటున్న జింక.. కన్నేసిన మొసలి.. కట్ చేస్తే అదిరిపోయే ట్విస్ట్.!

అడవిలో చట్టాలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఇది జగమెరిగిన సత్యం. జంతువు ఏదైనా కూడా తమను తాము ఎల్లప్పుడూ రక్షించుకుంటూ ఉండాలి...

Shocking Video: దాహం తీర్చుకుంటున్న జింక.. కన్నేసిన మొసలి.. కట్ చేస్తే అదిరిపోయే ట్విస్ట్.!
Deer

Updated on: Mar 21, 2021 | 11:23 AM

అడవిలో చట్టాలు డిఫరెంట్‌గా ఉంటాయి. ఇది జగమెరిగిన సత్యం. జంతువు ఏదైనా కూడా తమను తాము ఎల్లప్పుడూ రక్షించుకుంటూ ఉండాలి. లేదంటే వేరే జంతువుకు ఎర అయిపోవాల్సిందే. ప్రతీ రోజూ వైల్డ్ లైఫ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంటాయి. వాటిల్లో కొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. ఇక అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ఇందులో దాహార్తిని తీర్చుకోవడానికి వాగు వద్దకు వచ్చిన జింక రెప్పపాటులో తన ప్రాణాన్ని కాపాడుకోగలిగింది. అసలే నీటికి రారాజు మొసలి అని అంటారు. ఎంత అప్రమత్తంగా ఉందో గానీ.. దాని నుంచి ఈ జింకపిల్ల చాకచక్యంగా ఒక్క జంప్ చేసి తప్పించుకుంది. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

వాగు దగ్గర ఒక జింకపిల్ల నీరు త్రాగుతున్నట్లుగా వీడియోలో చూడవచ్చు. కానీ అప్పుడే రెప్పపాటులో ఓ మొసలి దానిపై దాడి చేసింది. ఎలా తప్పించుకుందో తెలియదు గానీ.. ఆ మొసలి నోటికి చిక్కకుండా ఒక్క జంప్ చేసింది. తెలివిగా తన ప్రాణాలను కాపాడుకోగలిగింది. ఈ ఆసక్తికరమైన వీడియోను లైఫ్ అండ్ నేచర్ అనే ట్విట్టర్ పేజీలో షేర్ చేయగా.. పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపించడమే కాకుండా రీ-ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!

తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!

Loading...
Unable to load recommendations.
Follow Us