Viral Video: వార్నీ.. ఇదేం పర్ఫార్మెన్స్ రా సామీ…! డ్యాన్స్ పోటీలో రచ్చ రచ్చ.. పరస్పరం చితకొట్టుకున్న డ్యాన్సర్లు..

|

Feb 03, 2024 | 7:15 PM

ఇలా రెండు జట్ల మధ్య అండర్ బ్యాటిల్ గ్రౌండ్ డ్యాన్స్ జరుగుతోంది. ఈ సమయంలో పోటీదారులు డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతలో ఒక డ్యాన్సర్ మరొకరితో గొడవ పడ్డాడు. పాములా డ్యాన్స్ చేస్తూ అతనిపైకి దూకుతూ వచ్చి దాడికి పాల్పడ్డాడు. కోపంతో నుదిటిపై బలంగా కొట్టాడు. దీంతో  అక్కడ చూస్తుండగానే ఆందోళనకర వాతావరణం నెలకొంది. క్షణక్షణం టెన్షన్‌గా మారింది. 

Viral Video: వార్నీ.. ఇదేం పర్ఫార్మెన్స్ రా సామీ...! డ్యాన్స్ పోటీలో రచ్చ రచ్చ.. పరస్పరం చితకొట్టుకున్న డ్యాన్సర్లు..
Dance Battle
Follow us on

అండర్ బాటిల్ గ్రౌండ్ డ్యాన్స్ పోటీ గురించి మీరు వినే ఉంటారు. ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ చూడటం ఉత్కంఠగా సాగుతుంది. డ్యాన్స్ చేస్తున్నప్పుడు, పోటీదారులు ఒకరి ఒకరు ఎగతాళి చేసుకుంటారు. ఇదొక అద్భుతమైన నృత్య యుద్ధ అనుభవం. అదే అండర్ బ్యాటిల్ గ్రౌండ్ డ్యాన్స్.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో పోటీదారులు డ్యాన్స్ చేస్తూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు. ప్రారంభంలో అంతా బాగానే ఉంది. కానీ ఒక్కసారిగా ఆ ప్రదేశంలో వాతావరణం చెదిరిపోయింది. డ్యాన్సర్ల గొడవలే ఇందుకు కారణం. ఈ వీడియో kaleshkomedy Instagram ఖాతాలో షేర్ చేయబడింది. లక్షలాది మంది ఇప్పటికే ఈ వీడియోను వీక్షించారు. అనేక రకాలుగా కామెంట్ చేశారు.

ఇలా రెండు జట్ల మధ్య అండర్ బ్యాటిల్ గ్రౌండ్ డ్యాన్స్ జరుగుతోంది. ఈ సమయంలో పోటీదారులు డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతలో ఒక డ్యాన్సర్ మరొకరితో గొడవ పడ్డాడు. పాములా డ్యాన్స్ చేస్తూ అతనిపైకి దూకుతూ వచ్చి దాడికి పాల్పడ్డాడు. కోపంతో నుదిటిపై బలంగా కొట్టాడు. దీంతో  అక్కడ చూస్తుండగానే ఆందోళనకర వాతావరణం నెలకొంది. క్షణక్షణం టెన్షన్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

అక్కడే ఉన్న మిగతా డ్యాన్సర్లు వీరి ఫటింగ్ ఆపడానికి ట్రై చేశారు. కానీ, ఎవరూ తగ్గటం లేదు.. ఈ సమయంలో తనపై దాడి చేసిన డ్యాన్సర్‌పై కోపంతో ఆ వ్యక్తి రివర్స్‌లో చెప్పుతో కొట్టాడు. దీంతో కొంతసేపు టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను వేల మంది షేర్ చేయగా, వందలాది మంది వివిధ రకాలుగా కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..