Viral News: ఉపాధి హామీ పని డబ్బుల కోసమని బ్యాంక్‌కు వెళ్లింది.. అధికారులు చెప్పింది విని..

ఉపాధి హామీ కూలీ డబ్బులు తెచ్చుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన ఓ మహిళకు ఊహించని పరిణామం ఎదురైంది. ఆమె బ్యాంక్ అకౌంట్‌ను ప్రీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఎందుకని ఆమె ప్రశ్నించిగా వాళ్లు చెప్పిన సమాధానం విని సదురు మహిళ షాక్ అయ్యింది. ఇంతకూ వాళ్లు ఏం చెప్పారో తెలిస్తే.. మీరు పరేషాన్ అవ్వాల్సిందే..

Viral News: ఉపాధి హామీ పని డబ్బుల కోసమని బ్యాంక్‌కు వెళ్లింది.. అధికారులు చెప్పింది విని..
Gst Notice To Daily Wager

Updated on: Jul 30, 2026 | 3:21 PM

రెక్కాడితే గానీ డొక్కాడని ఒక పేద మహిళకు కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఊహించని షాక్ ఇచ్చింది. తన పేరు మీద ఉన్న వ్యాపారానికి సంబంధించి రూ. 2.75 కోట్లకు పైగా జీఎస్టీ (GST) బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని వెంటనే క్లియర్ చేయాలని నోటీసులు పంపారు. అంతే కాదు ఆమె బ్యాంక్ ఖాతాను కూడా ఫ్రీజ్ చేశారు. అది విన్న సదురు మహిళ ఒక్కసారిగా కంగుతింది. రోజూ కూలీ చేసుకుడి జీవనం సాగించే తాను అంతడబ్బు ఎలా కడతానని.. అసలు తనకు వ్యాపారమే లేదని చెప్పుకొచ్చింది.ఈ ఘటన స్థానిక తీవ్ర కలకలం రేపింది.

అసలేం జరిగింది?

తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట సమీపంలోని పుత్తూరు పడవేట్టమ్మన్ కోవిల్ వీధికి చెందిన మురుగేశన్ అనే వ్యక్తి తన భార్య రుక్ముణి (56)తో కలిసిన స్థానికంగా నివాసముంటున్నారు. భార్య భర్తలు ఇద్దరు ఉపాధి హామీ పథకంలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే రుక్ముణి ఇటీవల తాము చేసిన 125 రోజుల పనికి సంబంధించిన డబ్బులను విత్‌డ్రా చేసుకోవడానికి స్థానికంగా ఉన్న ఓ బ్యాంక్‌కు వెళ్లింది. తన ఖాతాలో జమ అయిన ఉపాధి హామీ డబ్బులను ఇవ్వాలని అధికారులను కోరగా వారు ఆమెకు షాకంగ్ విషయం చెప్పారు.అంబూర్ సర్కిల్ వాణిజ్య పన్నుల సహాయ కమిషనర్ కార్యాలయం నుండి వచ్చిన లేఖ ఆధారంగా మీ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేశామని వారు వెల్లడించారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రుక్మణి పేరు మీద RM ట్రేడర్స్ అనే సంస్థ నడుస్తోందని, దాని ద్వారా ఏకంగా రూ. 2 కోట్ల 79 లక్షల 19 వేల 420 పన్ను ఎగవేసినట్లు నోటీసులో పేర్కొన్నట్టు వారు తెలిపారు. ఆ మాటలు వివి బిత్తరపోయిన రుక్మిణి తనకు ఎలాంటి వ్యాపారం లేదని.. తాను ఉపాధి హామీ పథకంలో పనిచేస్తానని తెలిపింది. ఇన్ని రోజులు చేసిన పని డబ్బులు కూడా బ్యాంక్ ఖాతాలోనే ఉన్నాయని.. డబ్బులు లేక ఇంట్లో పరిస్థితులు కూడా ఇబ్బందిగా మారాయని ఆమె తెలిపింది. అందుకే తన ఖాతాలోని డబ్బులను తీసుకొనేందుకు వచ్చానని తెలిపింది.

అయితే ఉపాధి హామీ కూలీ పనులు చేసే ఒక సాధారణ మహిళకు కోట్ల రూపాయల జీఎస్టీ నోటీసులు రావడం ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనంగా మారింది.ఈ విషయం తెలుసుకున్న అధికారులు బాధితురాలి ఖాతా వివరాలు దుర్వినియోగం అయ్యాయా లేక అధికారుల పొరపాటా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,.

Loading...
Unable to load recommendations.
Follow Us