
అకస్మాత్తుగా ‘సముద్రపు అలెగ్జాండర్’ మొసలి మీ ముందుకు వస్తే.? ఏం జరుగుతుందో తెలుసా.. దెబ్బకు మనం దడుసుకోవడం ఖాయం. ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూస్తే మీరూ దడుసుకోవడం ఖాయం. ఓ వ్యక్తి ప్రశాంతంగా పడవలో వచ్చి.. చేపలు పడుతుండగా.. అనూహ్యంగా నీటి లోపల నుంచి ఓ మొసలి హఠాత్తుగా వచ్చి లాక్కెళ్ళిపోతుంది. కొన్ని సెకన్ల వ్యవధిలో జరిగిన ఈ సీన్ ఇంటర్నెట్‌లో తెగ హల్చల్ చేస్తోంది.
వైరల్ వీడియో ప్రకారం.. ఒక పడవపై నుంచి తన వలకు చిక్కిన పెద్ద చేపను పట్టుకోవడానికి ఓ వ్యక్తి ప్రయత్నిస్తుండగా.. అనూహ్యంగా ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు.. నీటి అడుగున ఒక పెద్ద మొసలి చటుక్కున ఆ చేపను పట్టుకుని లాక్కెళ్ళిపోతుంది. వెంటనే సదరు వ్యక్తి తేరుకుని ప్రమాదం నుంచి బయటపడతాడు. కాగా, ఈ షాకింగ్ వీడియోను ‘అమేజింగ్ నేచర్’ అనే ట్విట్టర్ అకౌంట్ ఇంటర్నెట్‌లో షేర్ చేసింది. ఈ 37 సెకన్ల వీడియోకు మూడు లక్షలకు పైగా వ్యూస్ రాగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘తృటిలో తప్పిపోయింది. అసలేం జరిగి ఉండేదో.. ఎవ్వరం చెప్పలేం’ అని ఒకరు కామెంట్ చేయగా.. చేపలు పట్టేటప్పుడు మొసలితో చాలా జాగ్రత్తగా ఉండాలని మరొకరు కామెంట్ పెట్టాడు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Crocodile comes out of nowhere to snag the fish pic.twitter.com/XPW1wdwjiK
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) December 26, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి