Viral video: బొమ్మే కదా అని సెల్ఫీకి ట్రై చేశాడు.. తీరా దగ్గరికెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు!

Crocodile Attacks Tourist : బొమ్మ అనుకొని వాటర్‌లో కదలకుండా ఉన్న మొసలితో సెల్ఫీ దిగడానికి వెళ్లిన ఓ యువకుడు ఆ మొసలి దాడితో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ షాకింగ్ ఘటన ఫిలిప్పీన్స్‌లోని కబుబ్ మాంగ్రూవ్ పార్క్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

Viral video: బొమ్మే కదా అని సెల్ఫీకి ట్రై చేశాడు.. తీరా దగ్గరికెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు!
Crocodile Attack

Updated on: May 03, 2025 | 2:41 PM

వాటర్‌లో కదలకుండా ఉన్న ఓ మొసలిని బొమ్మ అనుకొని సెల్ఫీ దిగేందుకు వెళ్లిన యువకుడు ఆ మొసలి దాడిలో గాయపడిన ఘటన ఫిలిప్పీన్స్‌లోని కబుబ్ మాంగ్రూవ్ పార్క్‌లో చోటుచేసుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం. ఓ యువకుడు సరదాగా గడిపేందుకు ఫిలిప్పీన్స్‌లో కబుబ్ మాంగ్రూవ్ నేషనల్‌ పార్క్‌కు వచ్చాడు. కొద్ది సేపు ఆ పార్క్‌ మొత్తం తిరిగి చూశాడు. అలా తిరుగుతూ ఒక కొలను వద్ద ఆగాడు. ఆ కొలనులో అతనికి మొసలి లాంటి ఆకారం కనిపించింది. అయితే అది పర్యాటకులను ఆకర్షించేందుకు పెట్టిన బొమ్మ అనుకున్న ఆ యువకుడు.. దాని దగ్గరకు వెళ్లి సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు. ఇంతలో నీటిలో నుంచి బయటకు వచ్చిన మొసలి ఒక్కసారిగా ఆ యువకుడిపై దాడి చేసింది. అతన్ని నీటిలోకి లాగేసింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.

 

ఇక ఆ యువకుడు మొసలి ఉన్న కొలనులో పడిపోయి ఉండడాన్ని గమనించిన పర్యాటకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. భయంతో కేకలు వేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పార్క్‌ సిబ్బంది మొసలి ఉన్న చెరువు దగ్గరకు చెరుకున్నారు. చాలా సేపు శ్రమించిన ఆ యువకుడిని మొసలి భారీ నుంచి కాపాడగలిగారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే యువకుడు మొసలితో సెల్ఫీ దిగుతుండగా వీడియో తీసిన, అక్కడే ఉన్న కొందరు పర్యాటకులు, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…