Viral Video: ఈ జుగాడ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..!

సాధారణంగా టీ వడకట్టేందుకు స్ట్రైనర్ అవసరం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వ్యక్తి కాగితంతో టీ వడకట్టిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ తెలివైన ఆవిష్కరణను చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. ఆ వీడియోలో క్రియేటీవిటీ, సరదా రెండూ కలిసి ఉన్నాయి. ఇలాంటి ఐడియాలకే సోషల్ మీడియా వేదికగా మారుతోంది.

Viral Video: ఈ జుగాడ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..!
Tea Viral Video

Updated on: Jun 26, 2025 | 6:56 PM

సమస్యలు ఉన్నప్పుడే కదా పరిష్కారాలు పుట్టేది. మనుషులు ఎంత తెలివైనవాళ్లో అవసరానికి తగ్గట్టుగా ఎలాంటి జూగాడ్ కనిపెడతారో తెలుసుకోవాలంటే.. సోషల్ మీడియాకి మించిన వేదిక లేదు. ఇక్కడ ప్రతిరోజూ ఏదో ఒక కొత్త ఐడియాకి సంబంధించి వీడియో వైరల్ అవుతుంది. అది చూసేవాళ్లను ఆశ్చర్యపరుస్తుంది. కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తుంది కూడా.

ఈ ప్రపంచం ఏదైనా లేకుండా నడుస్తుంది కానీ.. తెలివైన జుగాడ్‌లు లేకుండా కాదు. ముఖ్యంగా మన ఇండియాలో ఇలాంటి ఆవిష్కరణాత్మక ఆలోచనలు మామూలయ్యాయి. చిన్న పనిలోనైనా, పెద్ద పనిలోనైనా.. మనిషి తనకు అనుకూలంగా దారి వెతుక్కునే గుణం కలవాడు. అలాంటి ఆలోచనలను చూడటానికి సోషల్ మీడియా ఒక అద్భుతమైన వేదిక. అందుకే కొన్ని రోజులకోసారి ఓ కొత్త వీడియో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఒక సూపర్ ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

మనందరి ఇంట్లో టీని కప్పుల్లోకి వడకట్టడానికి స్ట్రైనర్ వాడతాం. మరి అదే అందుబాటులో లేకపోతే..? అలాంటి సమయంలోనే అసలైన తెలివితేటలు బయటపడుతాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి గిన్నె పైన ఒక మామూలు కాగితాన్ని పెట్టాడు. దాని ద్వారా టీని మెల్లగా గిన్నెలోకి వడకడుతున్నాడు. దీన్నే సృజనాత్మక పద్ధతి అనాలి. ఈ అరుదైన ఆలోచన ఇంటర్నెట్‌ లో హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ వీడియోను bilaleditzz20 అనే ఇన్‌ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. నెటిజన్లు ఈ వీడియోపై రకరకాలుగా స్పందించారు.

వీడియో చూడండి: