Trending: కరోనా పేరు చెబితేనే ప్రపంచం హడిలిపోతోంది. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు.. వైద్యులు.. కూడా కరోనా ఊసెత్తితే ఉలిక్కిపడి మాస్క్ సరిగా ఉందొ లేదో చెక్ చేసుకుంటున్నారు. మాస్క్ కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు మొదటి రక్షణ అని ఎన్నో పరిశోధనలు తేల్చి చెప్పాయి. కానీ.. కొంతమంది ప్రజలు మాత్రం కరోనా అంటే నాకేం భయం.. అంటూ మొండిగా తిరిగేస్తున్నారు. అటువంటి వారిని చూస్తే కోపం వచ్చినా.. వారి అజ్ఞానానికి జాలి వేస్తుంది. అటువంటి మహానుభావులు మన చుట్టూ చాలా మంది ఉంటారు. ఇదిగో ఈ పెద్దాయన కూడా ఆ మహానుభావులకే బాప్.. ఎందుకంటే మనోడు చెప్పే కబుర్లు వింటే.. కరోనా కూడా హబ్బా అనుకుని కిసుక్కున నవ్వుకుంటుంది. అదేంటో మీరూ ఓ లుక్కేయండి..
ఈ మహానుభావుడు.. ఎక్కడివాడో సరిగా తెలియలేదు కానీ.. @Fake_memedia అనే ట్విట్టర్ ఎకౌంట్ నుంచి షేర్ అయినా ట్వీట్ లో కనిపిస్తున్నాడు. మనోడు ఓ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నాడు. ఎవరికోసం వచ్చాడో ఆ నేతకు జై కొడుతూ హుషారుగా చిందులు తొక్కాడు. ఇంత పెద్ద ర్యాలీలో మనోడు కనీసం మాస్క్ పెట్టుకోలేదు సరికదా తన పక్కన ఉన్నవారికీ మాస్క్ లేదు. పాపం ఓ జర్నలిస్ట్ ”మాస్క్ పెట్టుకోకుండా ఇలా మందితో కూడితే కరోనా పరేషానీ కాదా బాబూ” అని అడిగి మైక్ పెట్టాడు ఆయనగారి జవాబు కోసం అంతే.. అయన చెప్పిన సమాధానానికి మైక్ కూడా పగిలిపోయింది. ఇంతకీ ఈయన గారు ఏం చెప్పారో తెలుసా? ”నాకు కరోనా ఎందుకు వస్తాది. రాదు. రాదంటే రాదు” అని మైకు బద్దలు కొట్టి మరీ చెప్పాడు. ఏందిరా నాయనా..కరోనాతో వందల మంది పోతుంటే.. నాకేం కాదని ఎట్టా సెపుతావు అని ఆ జర్నలిస్ట్ అడిగితె.. ”నేను ఎండలో ఉన్నాకదా.. కరోనా నా కాడికి రాదు.” అన్నాడాయన. వార్నీ ఎండలో ఉంటె కరోనా రాదా? ఇదేం థీరీరా బాబూ.. జర ఇవరంగా సెప్పు.. అంటే.. మనోడు ఏం చెప్పాడో తెలుసా? ”ఇదో.. నేను ఎండలో కూసున్న కదా.. నా ఒళ్ళంతా చెమట పట్టినదా.. మరి ఈ చెమటతో కరోనా పారిపోదా?” అని సూత్రీకరించాడు.
ఈ వీడియోను తీసుకుని స్కూప్ చేసి ట్విట్టర్లో షేర్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. మరి మీరూ ఓ సరి ఆ వీడియో చూసి.. మనోడి సిద్ధాంతానికి నవ్వుకుంటారో.. ఓరి నీ పనికిమాలిన తెలివితేటలూ అని ముక్కున వేలేసుకుంటారో.. వీడెక్కడ దొరికాడురా బాబూ అని విసుక్కుంటారో మీ ఇష్టం.. అన్నట్టు వీడియో మాత్రం చివరివరకూ చూస్తేనే మీరు పూర్తిగా ఎంజాయ్ చేయగలరనేది మాత్రం నిజం.
Watch till end ?? pic.twitter.com/U1xpelRNpF
— CLowN (@Fake_memedia) April 13, 2021
Also Read: Corona Cases: సెప్టెంబర్ నాటి రికార్డు ఏప్రిల్ బద్దలు..? కరోనా సెకెండ్ వేవ్ ఉధృతే ఉధృతి