Viral Video: ఐపీఎస్ ఆఫీస‌ర్ అత్యుత్సాహం..! పెద్దాయన భోజనం చేస్తుండగా అడ్డుపడి..

|

Feb 15, 2024 | 2:04 PM

దాంతో తీవ్ర అవ‌మానానికి గురైన ఆ కానిస్టేబుల్.. తింటున్న భోజనం ప్లేటును డ‌స్ట్ బిన్‌లో ప‌డేసి వెళ్లి చేతులు కడిగేసుకున్నారు. ఇదంతా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది. సదరు ఐపీఎస్ ఆఫీస‌ర్‌ను

Viral Video: ఐపీఎస్ ఆఫీస‌ర్ అత్యుత్సాహం..! పెద్దాయన భోజనం చేస్తుండగా అడ్డుపడి..
Ips Officer
Follow us on

ఓ ఐపీఎస్ ఆఫీస‌ర్ అత్యుత్సాహంతో ఇప్పుడు అందరితో విమర్శలకు గురికావాల్సి వచ్చింది. అతడు చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు. ఖాకీ యూనిఫామ్‌ వేసుకున్న ఆఫీసర్లు ఎందరో మానవత్వం ప్రదర్శిస్తుంటే.. ఇతడు మాత్రం ఆకలితో ఉన్న ఓ సీనియ‌ర్ పోలీసు కానిస్టేబుల్ నోటికాడి బుద్దను కూడా లాగేసుకున్నంత పనిచేశాడు..విధుల్లో ఉన్న ఓ పెద్దాయన భోజ‌నం చేస్తుండ‌గా సదరు ఐపీఎస్‌ అధికారి అడ్డుకున్నాడు. ఇక్క‌డికి తిన‌డానికి రాలేదు.. విధి నిర్వ‌హ‌ణ‌కు వ‌చ్చిన విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని ఆ కానిస్టేబుల్‌ను ఐపీఎస్ ఆఫీస‌ర్ హెచ్చ‌రించాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అజంఘ‌ర్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి మోహ‌న్ యాద‌వ్ అజంఘ‌ర్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ క్ర‌మంలో అజంఘ‌ర్ పోలీసులు బందోబ‌స్తు క‌ల్పించారు. అయితే కార్య‌క్ర‌మం వ‌ద్ద భోజ‌న ఏర్పాట్లు కూడా చేశారు. ఇక విధుల్లో ఉన్న ఓ సీనియ‌ర్ పోలీసు కానిస్టేబుల్ ప్లేటులో ఆహారం వ‌డ్డించుకుని తినేందుకు సిద్ధ‌మ‌య్యారు. అంత‌లోనే అక్క‌డికి వ‌చ్చిన ఐపీఎస్ ఆఫీస‌ర్‌.. అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. మనం ఇక్క‌డికి వచ్చింది విధులు నిర్వర్తించేందుకు.. విందు భోజ‌నం చేయ‌డానికి కాద‌ని మంద‌లించారు. సీఎం ఇక్క‌డ్నుంచి వెళ్లిపోయిన త‌ర్వాత భోజ‌నం చేయాల‌ని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

దాంతో తీవ్ర అవ‌మానానికి గురైన ఆ కానిస్టేబుల్.. తింటున్న భోజనం ప్లేటును డ‌స్ట్ బిన్‌లో ప‌డేసి వెళ్లి చేతులు కడిగేసుకున్నారు. ఇదంతా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటంతో ఇప్పుడా వీడియో వైరల్‌గా మారింది. సదరు ఐపీఎస్ ఆఫీస‌ర్‌ను శుభం అగ‌ర్వాల్‌గా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై నెటిజ‌న్లు తీవ్రంగా మండిప‌డుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..