Viral Video: టోపీలా మారే మేఘాన్ని ఎప్పుడైనా చూశారా.? నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియోపై ఓ లుక్కేయండి..

|

Apr 08, 2022 | 11:13 AM

Viral Video: తనలో ఎన్నో అద్భుతాలను దాచుకుంది అందమైన ప్రకృతి. అందమైన ప్రదేశాలనే కాదు, అద్భుత విషయాలకు కూడా నెలవు. ప్రకృతిలో జరిగే విశేషాలను చూస్తుంటే ఔరా అనక మానదు. ఒకప్పుడు ఇలాంటి వింతలు కేవలం చూసిన వారికి మాత్రమే..

Viral Video: టోపీలా మారే మేఘాన్ని ఎప్పుడైనా చూశారా.? నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియోపై ఓ లుక్కేయండి..
Viral Video
Follow us on

Viral Video: తనలో ఎన్నో అద్భుతాలను దాచుకుంది అందమైన ప్రకృతి. అందమైన ప్రదేశాలనే కాదు, అద్భుత విషయాలకు కూడా నెలవు. ప్రకృతిలో జరిగే విశేషాలను చూస్తుంటే ఔరా అనక మానదు. ఒకప్పుడు ఇలాంటి వింతలు కేవలం చూసిన వారికి మాత్రమే పరిమితం అయ్యేవి. అయితే ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ (Smartphone) వినియోగం పెరగడం, అందరికీ ఇంటర్‌నెట్‌ అందుబాటులోకి రావడం, సోషల్‌ మీడియా (Social Media) అందుబాటులోకి రావడంతో ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా సమాచారం ఇట్టే ప్రపంచన్నా చుట్టేస్తోంది. మన ఊహకు కూడా అందని ఎన్నో అద్భుత దృశ్యాలను అరచేతిలోకి వచ్చేస్తున్నాయి. ఇలా ప్రతి రోజూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న వీడియోలు కోకొల్లలు, తాజాగా ఇలాంటి ఓ వీడియోనే నెట్టింట హంగామా చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. మంచు దుప్పటితో కప్పబడి ఉన్న ఓ పర్వతంపై మేఘం గుండ్రంగా ఏర్పడింది. పర్వత శిఖరంపై అచ్చంగా టోపీ పెట్టినట్లు ఉన్న ఈ మేఘం కొండ చుట్టూ గిరగిరా తిరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను మెస్మరైజ్‌ చేస్తోంది. ఇదిలా ఉంటే మేఘాలు ఇలా ఏర్పడడాన్ని లెంటిక్యులర్‌ క్లౌ్‌డ్‌ లేదా టోపీ మేఘం అంటారు. ఈ మేఘాలు సాధారణంగా పర్వతాలపైనే ఏర్పడతాయి. అమేజింగ్ నేచర్‌ అనే ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియోలో మేఘం క్యాప్‌లా ఏర్పడినట్లు కనిపిస్తున్నా. కొంత గ్రాఫిక్స్‌లా అనిపిస్తుంది. కానీ గతంలో ఇలాంటి టోపీ మేఘాలకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి.

Also Read: గృహిణిలకు బంపర్ ఆఫర్ .. ముత్యాలను హారాలుగా మార్చమని ముంచేశారు..

Ghani Twitter Review: ప్రేక్షకుల ముందుకు మెగా ప్రిన్స్ ‘గని’.. చూసినవారు ఏమంటున్నారంటే

Optical Illusion: ఈ ఫొటోలో ఒక పక్షి, ఒక జంతువు దాగి ఉన్నాయి.. అవేంటో కనిపెడితే మీరు గ్రేటే..