Viral News: ప్లేట్ ఇడ్లీ అక్షరాలా రూ.500.. దీని ప్రత్యేకత ఏంటంటే..?

|

Jun 27, 2024 | 4:24 PM

ఇదిలా ఉంటే సాధారణంగా ప్లేట్ ఇడ్లీ ధర ఎంత ఉంటుంది.? రూ. 30 మహా అయితే ఒక రూ. 50 ఉంటుంది అంటారు కదా! అయితే చెన్నైలోని ఓ హాటల్‌లో మాత్రం ప్లేట్ ఇడ్లీ ధర ఏకంగా రూ. 500కి అందిస్తున్నారు. ఆ ఇడ్లీలో అంతగా ఏముందనేగా మీ సందేహం. ఇంతకీ ఆ ఇడ్లీలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

Viral News: ప్లేట్ ఇడ్లీ అక్షరాలా రూ.500.. దీని ప్రత్యేకత ఏంటంటే..?
Representative Image
Follow us on

టిఫిన్‌ అనగానే మనలో చాలా మందికి ఇడ్లీ గుర్తొస్తుంది. కేవలం హోటల్స్‌లోనే కాకుండా, ఇంట్లో కూడా చాలా మంది ఇండ్లీని ప్రిపేర్‌ చేసుకుంటారు. లైట్ ఫుడ్‌ కావడం.. మేకింగ్ కూడా సింపుల్‌ కావడంతో చాలా మంది ఇడ్లీకి ప్రాధాన్యత ఇస్తుంటారు.

ఇదిలా ఉంటే సాధారణంగా ప్లేట్ ఇడ్లీ ధర ఎంత ఉంటుంది.? రూ. 30 మహా అయితే ఒక రూ. 50 ఉంటుంది అంటారు కదా! అయితే చెన్నైలోని ఓ హాటల్‌లో మాత్రం ప్లేట్ ఇడ్లీ ధర ఏకంగా రూ. 500కి అందిస్తున్నారు. ఆ ఇడ్లీలో అంతగా ఏముందనేగా మీ సందేహం. ఇంతకీ ఆ ఇడ్లీలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

చెన్నైలోని అడరాయ్‌ ఆనంద్‌ భవన్‌ హోటల్‌లో ఈ కాస్లీ ఇడ్లీ లభిస్తోంది. ఈ ఇడ్లీ ఇంతలా ధర పలకడానికి కారణం దీని తయారీలో ఉపయోగించే వస్తువులే కారణంగా చెప్పొచ్చు. బాదం, బ్లూబెర్రీస్‌, ఆలివ్‌ ఆయిల్‌తో పాటు మరెన్నో ఇంగ్రీడియంట్స్‌ను ఉపయోగించారు. ఈ ఇడ్లీ తయారీలో లవంగాలు, దాల్చిన చెక్క, షిటాకే మష్రూమ్, బ్రెజిల్ నట్, ఒమేగా 3 – ఫ్లాక్స్ సీడ్, అల్లం పొడి, అశ్వగంధ సారం, 24 గంటలు నానబెట్టిన బాదం, వాల్‌నట్స్, పిస్తా, జీడిపప్పు, బ్లూ బెర్రీస్‌, ఆలివ్‌ నూనె, కొత్తిమీర, అవోకాడో, కుంకుమపువ్వు వంటి ఎన్నో పోషకాలతో ఇడ్లీని తయారు చేశారు.

ఈ ఇడ్లీ ధర రూ. 500..

డయాబెటిస్‌తో బాధపడేవారు కూడా ఈ ఇడ్లీని నిస్సందేహంగా తీసుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో ఉపయోగించిన ఆలివ్‌ ఆయిల్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్‌కు పెట్టింది పేరైన బ్లూబెర్రీస్‌ను ఇందులో ఉపయోగించారు. ఇన్ని రకాల పదార్థాలు ఉపయోగించారు, ఆరోగ్యానికి ఇంత మేలు చేస్తుంది కాబట్టే ఈ ఇడ్లీకి ఇంత ధర పలుకుతోంది. మరెందుకు మీరు కూడా ఎప్పుడైనా చెన్నై వెళ్తే ఈ ఇడ్లీని ఒక్కసారైనా టేస్ట్ చూడండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..