Funny Video: ఇదెక్కడి ‘పిల్లి’రా బాబూ.. టీవీలో చూసి రచ్చ రచ్చ చేసేసింది.. వీడియో చూసి పండుగ చేసుకోండి..!

|

Apr 24, 2022 | 10:29 PM

Funny Video: జంతువుల చర్యలు కొన్నిసార్లు విపరీతమైన నవ్వును తెప్పిస్తాయి. అవి చేసే అల్లరి ఎవరైనా ఫిదా అయిపోతారు. ఎంతటి టెన్షన్ ఉన్నా క్షణాల్లో హుష్‌కాక్ అవ్వాల్సిందే.

Funny Video: ఇదెక్కడి ‘పిల్లి’రా బాబూ.. టీవీలో చూసి రచ్చ రచ్చ చేసేసింది.. వీడియో చూసి పండుగ చేసుకోండి..!
Cat
Follow us on

Funny Video: జంతువుల చర్యలు కొన్నిసార్లు విపరీతమైన నవ్వును తెప్పిస్తాయి. అవి చేసే అల్లరి ఎవరైనా ఫిదా అయిపోతారు. ఎంతటి టెన్షన్ ఉన్నా క్షణాల్లో హుష్‌కాక్ అవ్వాల్సిందే. ముఖ్యంగా ఇంట్లో పెంచుకునే కుక్క, పిల్లుల అల్లరి చెప్పనలవి కాదంతే. ఎందుకంటే.. అవి చేసే రచ్చ ఆ రేంజ్‌లో ఉంటుంది మరి. తాజాగా పిల్లి అల్లరికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో ఊపేస్తుంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్ పండుగ చేసుకుంటున్నారు. అవును.. ఈ వీడియోలో ఓ పెంపుడు పిల్లి.. ఇంట్లో టీవీ చూస్తోంది. ఆ టీవీలో టామ్ అండ్ జెర్రీ ప్రోగ్రామ్ వస్తోంది. ఆ షో చూస్తూ పిల్లి ఎంజాయ్ చేస్తోంది. అందులోని ప్రతీ సన్నివేశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. దానికి తగ్గట్లుగా హవభావాలను ఇస్తోంది. ఇంతలో ఆ షో లో కుక్క.. నిద్రిస్తున్న టామ్‌పై అటాక్ చేస్తుంది. దాంతో టామ్ లేచి పరుగులు తీస్తుంది. అయితే, టీవీ షో లో కుక్క ఇచ్చి ఝలక్‌కు.. ఇక్కడ పిల్లి బెదిరిపోయింది. టామ్ కంటే స్పీడ్‌గా రియాక్ట్ అయి అక్కడి నుంచి పరుగు లంకించుకుంది. అయితే, ఈ సీన్‌ అక్కడ ఉన్న కెమెరాలో రికార్డ్ అయ్యింది. వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @buitengebieden_ పేరుతో పోస్ట్ చేశారు. దాంతో వీడియో తెగ వైరల్ అయ్యింది. 10 సెకన్ల ఈ వీడియోను 8.54 లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించారు. అదే సమయంలో 43 వేల లైక్స్ వచ్చాయి. వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వకుంటున్నారు. మస్తు ఖుషీ అవుతున్నారు. పిల్లి రియాక్షన్‌పై తమదైన స్టైల్‌లో కామెంట్స్ చేస్తున్నారు.


Also read:

Viral Video: నీటిలో సరదాగా స్విమ్మింగ్ చేస్తున్న పాము.. సడెన్‌గా దూసుకొచ్చిన మొసలి.. షాకింగ్ సీన్ చూస్తే హడలే..!

Viral Video: విమానాశ్రయంలో చిన్నారితో సరదాగా పోలీస్ ఆఫీసర్.. వీడియోకు ఫిదా అయిపోతున్న నెటిజన్లు..!

Love Failure: ‘నా చావు నీ పెళ్లి కానుక, ఐ లవ్ యూ’.. ప్రేయసికి లేఖ రాసిన యువకుడు.. చివరకు..!