Viral Photo: ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నోడు.. ఇప్పుడు సౌత్‌ ఇండియా స్టార్‌ హీరోల్లో ఒకరు. ఎవరో గుర్తుపట్టారా.?

|

Feb 18, 2022 | 8:45 PM

Viral Photo: సినీ తారల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలనే కోరిక వారి అభిమానులకు ఉండడం సర్వసాధారణం. ఒకప్పుడు తమ అభిమానుల వివరాలను తెలుసుకోవాలంటే ఫ్యాన్స్‌ పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. న్యూస్‌ పేపర్లలో వచ్చే ఫోటోలు తప్ప...

Viral Photo: ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నోడు.. ఇప్పుడు సౌత్‌ ఇండియా స్టార్‌ హీరోల్లో ఒకరు. ఎవరో గుర్తుపట్టారా.?
Guess This Actor
Follow us on

Viral Photo: సినీ తారల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలనే కోరిక వారి అభిమానులకు ఉండడం సర్వసాధారణం. ఒకప్పుడు తమ అభిమానుల వివరాలను తెలుసుకోవాలంటే ఫ్యాన్స్‌ పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. న్యూస్‌ పేపర్లలో వచ్చే ఫోటోలు తప్ప పెద్దగా సిని తారల ఫోటోలు కనిపించేవి కావు. కానీ ఏమంటూ సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిందో సినీ తారలు తమ అభిమానులకు మరింత చేరువయ్యారు. తమ వ్యక్తిగత ఫోటోలు, విషయాలతో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌తో ఉంటూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు.

ఇలా ఫ్యాన్స్‌తో తమ చిన్ననాటి ఫోటోలను కూడా పంచుకోవడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా నడుస్తోంది. దీంతో హీరోలు షేర్‌ చేసిన ఫోటోలను తమ అభిమానులు కొందరు తిరిగి పోస్ట్‌ చేస్తూ.. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టండి అంటూ ఫ్యాన్స్‌కు ఛాలెంజ్‌ విసురుతున్నారు. మీకు పైన కనిపిస్తోన్న ఫోటో కూడా ఇలాంటిదే. చూడడానికి చబ్బీగా, తలపై క్యాప్‌తో చిన్నప్పుడే హీరోల కనిపిస్తోన్న ఆ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.? ప్రస్తుతం ఈ యంగ్ హీరో సౌత్‌ ఇండియా స్టార్‌ హీరోల్లో ఒకరు. తన అద్భుత నటనతో తమిళం, తెలుగులో ఎంతో మంతి అభిమానులను సొంతం చేసుకున్నాడు.

ఇంతకీ ఆ కుర్రాడు ఎవరంటే.. తమిళ స్టార్‌ హీరో కార్తి. స్టార్ హీరో సూర్య తమ్ముడిగా సినీ నేపథ్యం ఉన్నా తన అద్భుత నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు కార్తి. 2004లో తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తి. అనంతరం పలు వరుస సినిమాలతో బిజీ హీరోగా మారాడు. తమిళంతో పాటు, తెలుగులోనూ భారీ విజయాలను సొంతం చేసుకున్న ఈ హీరో ప్రస్తుతం విరుమన్‌, సర్దార్‌, పొనియన్‌ సెల్వాన్‌ చిత్రాల్లో నటిస్తున్నారు.

Also Read:Shanmukh Jashwanth: తప్పు ఒప్పుకున్న షణ్ను.. వీడియో

KTR on Modi: నమో అంటే నరేంద్ర మోడీ కాదు.. కొత్త భాష్యం చెప్పిన మంత్రి కేటీఆర్!