Viral Photo: ఈ ఫొటోలో ఓ తప్పుంది అదెంటో గుర్తించారా.? ఆన్సర్‌ తెలిస్తే నవ్వకుండా ఉండలేరు..

Viral Photo: సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కాదేది వైరల్‌కు అనర్హం అన్నట్లు పరిస్థితి మారిపోయింది. ఫ్రాంక్‌, ఫన్నీ వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇక ఎంతో మంది ఔత్సాహిక క్రియేటర్లు...

Viral Photo: ఈ ఫొటోలో ఓ తప్పుంది అదెంటో గుర్తించారా.? ఆన్సర్‌ తెలిస్తే నవ్వకుండా ఉండలేరు..
Viral Photo

Updated on: Aug 17, 2022 | 9:50 AM

Viral Photo: సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కాదేది వైరల్‌కు అనర్హం అన్నట్లు పరిస్థితి మారిపోయింది. ఫ్రాంక్‌, ఫన్నీ వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇక ఎంతో మంది ఔత్సాహిక క్రియేటర్లు సైతం రకరకాల వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌తో పాటు డబ్బులు కూడా సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్లను ఆకట్టుకోవడానికి ఫన్నీ కంటెంట్‌ను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే రీల్స్‌లో వైరల్‌ అవుతోంది.

ఓ కుర్రాడు చేతిలో స్మార్ట్‌ఫోన్‌, మరో చేతిలో మైక్‌ను పట్టుకొని రోడ్డుపై వెళుతోన్న ఓ మహిళకు ఓ ప్రశ్న సంధించాడు. ఫోన్‌లో ఫొటోను చూపించి అందులో ఉన్న తప్పును గుర్తించమని అడిగాడు. అయితే సదరు మహిళ ఎంత ప్రయత్నించినా సమాధానం మాత్రం కనుక్కోలేక పోయింది. ఎంతసేపు గమనించిన అందులో తప్పు మాత్రం కనిపించలేదు. చివరికి అతనే సమాధానం చెప్పాడు. దీంతో మహిళ ఒక్కసారిగా నవ్వేసింది.

ఇవి కూడా చదవండి

మీరైనా ప్రశ్నకు బదులు చెప్పగలరేమో ఓసారి ప్రయత్నించండి. ఫొటోలో ఉన్న మిస్టేక్‌ మీకు కనిపిస్తోందా.? ఏంటి మీకు కూడా సమాధానం కనిపంచడం లేదా.? అయితే ఇంగ్లిష్‌లో రాసున్న అక్షరాలను ఓ సారి గమనించండి కనిపించిందా.. ఇంకా ఆన్సర్‌ తెలియలేదా ఇంగ్లిష్‌లో Find పక్కన The అనే పదం రెండుసార్లు వచ్చింది చూశారా.? అదేనండి ఈ ఫొటోలో ఉన్న మిస్టేక్‌. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. నెటిజన్లు తమ ఫ్రెండ్స్‌కు ఫొటోను పంపిస్తూ ఆన్సర్‌ కనుక్కోమని ఛాలెంజ్‌ విసురుతున్నారు.

 మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us