
అప్పుడప్పుడూ మనం చూసే కొన్ని ఫోటోలు.. మన కళ్లను మోసం చేస్తుంటాయి. వాటిల్లో పైకి కనిపించేవి ఒకటయితే.. లోపల దాగున్న మర్మమైన రహస్యాలు వేరేవి. పైపైకి నార్మల్‌గా కనిపించే ఈ ఫోటోలను.. నెమ్మదిగా క్షుణ్ణంగా పరిశీలిస్తేనే లోపలున్న సమాధానాలు కనిపిస్తాయి. ఇలాంటి వాటిని ఫోటో పజిల్స్ లేదా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు అని అంటారు. ఈ ఫోటో పజిల్స్ సోషల్ మీడియాలో కోకొల్లలు. ఏ సోషల్ మీడియా హ్యాండిల్ చూసినా.. ఇవి కనిపిస్తాయ్. సరదా టైంలో వీటిని ఓ పట్టు పట్టేస్తుంటారు కొందరు. ఇవి మన ఐ ఫోకస్ పెంచడమే కాదు.. బుర్రను పదునెక్కిస్తాయి. తాజాగా అలాంటిదే ఓ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. మరి అదేంటో చూసేద్దామా..
పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.. పొదల్లా ఉన్న ఈ ప్రదేశంలో ఎటు చూసినా.. ఎండిన కర్రలు ఉన్నాయని మీకు కనిపిస్తోంది కదూ..! కరెక్టే.. అక్కడ అన్ని ఎండిన కర్రలు ఉన్నాయ్.. ఇక ఆ చోట ఓ గుడ్లగూబ ఎంచక్కా సేద తీరుతోంది. ఈ పజిల్ చాలా కష్టం. నూటికి 90 శాతం మంది ఈ పజిల్ సాల్వ్ చేయలేరు. ఒకవేళ మీరు ఈ ఫోటోలోని గుడ్లగూబను క్షణాల్లో కనిపెట్టేస్తే.. మీ ఐ ఫోకస్ రేంజ్ అదిరిపోయినట్టే. అయ్యో.! మా వల్ల కాదు.. ఈ పజిల్ నేను సాల్వ్ చేయలేను అని అంటారా.. ఆన్సర్ కోసం కింద ఫోటో చూసేయండి..