Viral Photo: మీ కళ్లల్లో పవర్ ఉన్నట్లయితే.. 10 సెకన్లలో ఈ ఫోటోలో 2 గుడ్లగూబలను కనిపెట్టండి.!

ఫోటోలు, ఫన్నీ వీడియోస్, వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఒక ఎత్తయితే.. మెదడుకు పదునుపెట్టే సరదా గేమ్స్, పజిల్స్ మరో ఎత్తు.

Viral Photo: మీ కళ్లల్లో పవర్ ఉన్నట్లయితే.. 10 సెకన్లలో ఈ ఫోటోలో 2 గుడ్లగూబలను కనిపెట్టండి.!
Viral Photo

Updated on: Aug 09, 2022 | 5:48 PM

ఫోటోలు, ఫన్నీ వీడియోస్, వెబ్ సిరీస్‌లు, సినిమాలు ఒక ఎత్తయితే.. మెదడుకు పదునుపెట్టే సరదా గేమ్స్, పజిల్స్ మరో ఎత్తు. అందుకేనేమో ఇంటర్నెట్‌లో ఇటీవల ఫోటో పజిల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. ఫోటో పజిల్స్.. మన మెదడును చురుకుగ్గా ఉంచడమే కాదు.. కళ్లకు కూడా పదునుపెడతాయి. ఆయా ఫోటోల్లో పైకి కనిపించేది ఒకటయితే.. లోపల అంతర్లీనంగా మరొకటి ఉంటుంది. దాన్ని కనిపెట్టడమే చాలా కష్టం. మనం మనసును తికమక పెట్టడమే కాదు.. కళ్ళను కూడా మభ్యపెడతాయి. లేట్ ఎందుకు మరో ఆ కోవకు చెందిన ఓ పజిల్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటో తెలుసుకుందాం..

పైన కనిపిస్తోన్న ఫోటోలో రెండు గుడ్లగూబలు దాగున్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో మీరు కనిపెట్టాలి. చూడటానికి ఓ చెట్టు కొమ్మలా ఉంది కదూ.. మీరు అనుకున్నది కరెక్టే.. ఫోటోగ్రాఫర్ చాకచక్యంగా ఆ గుడ్లగూబలను ఫోటో తీశాడు. మనకు సవాల్‌ను విసురుతున్నాడు. ఈ పజిల్‌ను నూటికి 99 మంది సాల్వ్ చేశారు. పైపైన చూడకుండా.. నిశితంగా ఫోటోను చూస్తే మీరు గుడ్లగూబలను కనిపెట్టొచ్చు. చాలా ఈజీ పజిల్ అండీ.. ఒక్కసారి ట్రై చేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Follow Us