Viral Photo: ఈ ఫోటోలో హచ్‌ డాగ్‌ నక్కి నక్కి చూస్తోంది.. ఎక్కడుందో కనిపించిందా.?

|

Feb 12, 2022 | 6:34 PM

Viral Photo: సోషల్‌ మీడియాతో ప్రపంచచమంతా అరచేతిలోకి వచ్చేసింది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే అరచేతిలో ప్రత్యక్షమవుతోంది. ప్రపంచ నలుమూలల ఎక్కడ చీమ చిటుక్కుమన్నా వెంటనే సోషల్‌ మీడియాలో..

Viral Photo: ఈ ఫోటోలో హచ్‌ డాగ్‌ నక్కి నక్కి చూస్తోంది.. ఎక్కడుందో కనిపించిందా.?
Find Dog
Follow us on

Viral Photo: సోషల్‌ మీడియాతో ప్రపంచచమంతా అరచేతిలోకి వచ్చేసింది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే అరచేతిలో ప్రత్యక్షమవుతోంది. ప్రపంచ నలుమూలల ఎక్కడ చీమ చిటుక్కుమన్నా వెంటనే సోషల్‌ మీడియాలో దర్శనమిస్తోంది. ఇలా సమాచార మార్పిడిలో పెను సంచలనంగా మారిన సోషల్‌ మీడియా కేవలం ఇన్ఫర్మేషన్‌ మాత్రమే కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా అందిస్తోంది. అంతేనా.. క్రియేటర్లకు తమ ప్రతిభను చూపించుకునే వేదికగా కూడా మారింది.

ఇలా సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తోన్న వాటిలో ఫోటో పజిల్స్‌ ఒకటి. ఫోటోల్లో దాగున్న జంతువులను గుర్తించే పజిల్స్‌ సోషల్‌ మీడియాలో ఇటీవల బాగా వైరల్‌ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ ఫోటోనే నెట్టింట వైరల్‌ అవుతోంది. ఓ పార్క్‌లో తీసిన ఫోటో నెటిజన్లు ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ ఫోటోలో అంతలా ఉన్న ఆ ప్రత్యేక ఏంటనేగా మీ సందేహం.

పైన కనిపిస్తోన్న ఫోటోలో ఓ కుక్క పిల్ల దాగి ఉంది. అప్పట్లో ప్రముఖ టెలికాం కంపెనీ హచ్‌ రూపొందించిన ప్రకటనలో కనిపించే కుక్క పిల్లే ఈ ఫోటోలో దాగి ఉంది. నక్కి నక్కి ఫోటోకు పోజిచ్చిన ఆ కుక్కను పిల్లను గుర్తించండి అంటూ ఈ ఫోటోను నెటిజన్లు పోస్ట్‌ చేస్తున్నారు. దీంతో తమ కళ్లకు పని చెప్పిన నెటిజన్లు కుక్క పిల్లను గుర్తించే పనిలో పడ్డారు. పజిల్‌ను చేధించినవారు ఆ ఫోటోను ఇతరులకు పంపి ఛాలెంజ్‌ విసురుతున్నారు.

మరి ఆ కుక్క పిల్ల మీకూ కనిపిస్తుందేమో ఓసారి ఏకాగ్రతతో చూడండి. కనిపించలేదా.. అయితే ఓ సారి ఆ పార్కులో ఉన్న బెంచ్‌ను జాగ్రత్తగా చూడండి. బెంచ్‌లో చేతు పెట్టుకోవడానికి ఉన్న స్టాండ్‌ వెనకాలే ఆ కుక్కపిల్ల ఉంది. ఆ చిన్న రంధ్రంలోని నుంచి ఫోటోకు పోజిస్తోంది.

Also Read: IPL 2022 Auction: తగ్గేదేలే.! మెగా వేలంలో దుమ్ముదులిపిన యువ ప్లేయర్స్.. సీనియర్లకు నిరాశ..

Bhishma Ekadashi: భీష్మ ఏకాదశి విశిష్టత.. ఈ పర్వదినం రోజున విష్ణు సహస్రనామాలు చదివితే కలిగే అద్భుత ఫలితం..