Find Dog: ఈ ఫొటోలో ఓ శునకం దాక్కొని ఉంది ఎక్కడుందో కనిపించిందా.? ఓసారి ట్రై చేయండి..

|

Sep 12, 2021 | 12:33 PM

Find Dog: సోషల్‌ మీడియాలో ప్రతీ రోజూ రకరకాల ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వీటిలో కొన్ని మనకు సమాచారాన్ని అందిస్తే మరికొన్ని ఆనందంతో పాటు ఎగ్జైట్‌మెంట్‌ను అందిస్తుంటాయి...

Find Dog: ఈ ఫొటోలో ఓ శునకం దాక్కొని ఉంది ఎక్కడుందో కనిపించిందా.? ఓసారి ట్రై చేయండి..
Follow us on

Find Dog: సోషల్‌ మీడియాలో ప్రతీ రోజూ రకరకాల ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. వీటిలో కొన్ని మనకు సమాచారాన్ని అందిస్తే మరికొన్ని ఆనందంతో పాటు ఎగ్జైట్‌మెంట్‌ను అందిస్తుంటాయి. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో పజిల్‌ ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. మెదడుకు మేతగా, కంటి పరీక్షకు సవాల్‌ విసురుతూ కొన్ని ఫొటోలను నెటిజన్లు తెగ షేర్‌ చేస్తున్నారు. వారి స్నేహితులకు సవాల్‌ విసురుతూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెట్టింట వైరల్‌గా మారింది.


పైన కనిపిస్తోన్న ఫొటోలో ఓ శునకం ఉందన్న విషయం మీకు తెలుసా.? యజమాని తన పెంపుడు శునకం ఎక్కడో ఉందో చూసి కెమెరాలో బంధించాడు. దీంతో ఈ ఫొటోను నెట్టింట్‌ ఫోస్ట్‌ చేసి శునకం ఎక్కడ ఉందో చెప్పుకోండి చూద్దాం అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో నెటిజన్లు శునకాన్ని వెతికే పనిలో పడ్డారు. ఆ కుక్కును గుర్తిస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇందులో శునకం ఎక్కడుందో మీరు కూడా ఓ ప్రయత్నం చేయండి.!

ఇంతకీ ఆ శునకం ఎక్కడ ఉందంటే..

Also Read: నల్ల గోధుమలతో ఆరోగ్యం.. ఆదాయం సంపాదించవచ్చు.. అది ఎలా సాగు చేయాలో తెలుసుకోండి

Black Magic: సంచలన ఘటన.. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో మామను చంపిన అల్లుడు

భారత్‌లో జన్మించాడు.. దక్షిణాఫ్రికా తరపున క్రికెట్ ఆడాడు.. అనంతరం బ్రిటిష్ సైన్యంతో యుద్ధం కూడా.. ఆ ప్లేయర్ ఎవరంటే?