
బరువు తగ్గడం అనేది నేటి కాలంలో చాలామందికి ఒక పెద్ద సవాలుగా మారింది. సమయం లేకపోవడం, జిమ్‌కు వెళ్లలేని పరిస్థితి ఉన్నవారిని ఆకట్టుకుంటూ ఇంటర్నెట్‌లో ఒక జపనీస్ వ్యాయామ వీడియో హల్‌చల్ చేస్తోంది. రోజుకి కేవలం 4 నిమిషాలు కేటాయించండి.. 7 రోజుల్లో 5 కేజీల బరువు తగ్గండి అనే వ్యాఖ్యలతో ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక జపనీస్ 4 నిమిషాల వ్యాయామ వీడియో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రోజుకు కేవలం 4 నిమిషాల పాటు ఈ వర్కవుట్ చేస్తే 7 రోజుల్లో ఏకంగా 5 కేజీల బరువు తగ్గవచ్చని ఇందులో దావా చేస్తున్నారు. ఇందులో ఎటువంటి డంబెల్స్ కానీ, జిమ్ పరికరాలు కానీ అవసరం లేదు. ఎలాంటి వ్యాయామ పరికరాలు లేకుండా, ఇంట్లోనే సొంత శరీర బరువు ఆధారంగా చేసుకునే ఈ పద్ధతి మిలియన్ల మంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీనిని తబాతా తరహా హై-ఇంటెన్సిటీ ట్రైనింగ్‌గా చెబుతున్నారు.
20 సెకన్ల పాటు అత్యంత వేగంగా, తీవ్రమైన వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. స్క్వాట్స్, జంపింగ్ జాక్స్ లేదా బర్పీస్ చేయాలి. ఆ తర్వాత వెంటనే 10 సెకన్ల విరామం తీసుకోవాలి. ఇలా 8 సెట్లను వరుసగా పూర్తి చేయడానికి సరిగ్గా 4 నిమిషాల సమయం పడుతుంది. ఈ పద్ధతి వల్ల వ్యాయామం ముగిసిన తర్వాత కూడా శరీరం రోజంతా క్యాలరీలను కరిగిస్తూనే ఉంటుందని నమ్ముతారు.
ఈ వైరల్ దావాలపై ఫిట్‌నెస్, ఆరోగ్య నిపుణులు పలు విషయాలను స్పష్టం చేస్తున్నారు. అతి తక్కువ సమయంలో శరీరంలో బరువు తగ్గినట్లు అనిపిస్తే, అది కొవ్వు కరగడం వల్ల కాదు. కేవలం శరీరంలో ఉన్న నీటి శాతం, గ్లైకోజెన్ తగ్గడం వల్ల మాత్రమే జరుగుతుంది. ఆరోగ్యకరమైన పద్ధతిలో వారానికి 0.5 కేజీ నుండి 1 కేజీ బరువు తగ్గడమే సురక్షితం. వారానికి 5 కేజీలు తగ్గడం అనేది శరీర జీవక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
X లో రీపోస్ట్ చేసిన తర్వాత ఈ వీడియోకు పెద్ద సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.. ఒక రీపోస్ట్‌కు 7 మిలియన్లకు పైగా వ్యూస్ దాదాపు 83,000 లైక్‌లు వచ్చాయి. స్పీడ్‌గా చేసే వ్యాయామం, ఏమీ చేయకపోవడం కంటే క్రమం తప్పకుండా కొద్దిపాటి వ్యాయామం చేయడం మంచిదా కాదా అనే చర్చకు కూడా వినియోగదారులను పురికొల్పింది.
영상은 길이는 고작 4분.
일주일동안 매일 루틴으로 하면
-5kg이 빠진다는 일본 다이어트 영상.지금 일본에서 엄청난 유행임.
마운자로 집어 던지고 이거하자.
부작용 따위 없다. pic.twitter.com/J5ewOHbnui— rrace🇰🇷 (@junssi1982) August 31, 2026
కేవలం 4 నిమిషాల వ్యాయామం మాత్రమే బరువును తగ్గించలేదు. దీనితో పాటు సరైన కేలరీ డెఫిసిట్ ఆహార నియమాలు పాటిస్తేనే మార్పు సాధ్యమవుతుంని నిపుణులు సూచిస్తున్నారు. సమయం లేనివారికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ 4 నిమిషాల జపనీస్ వర్కవుట్ ఒక మంచి ప్రారంభం. కానీ 7 రోజుల్లో 5 కేజీలు తగ్గుతారనే ప్రచారాన్ని గుడ్డిగా నమ్మకుండా, క్రమశిక్షణతో కూడిన వ్యాయామం, సమతుల్య ఆహారం పాటించడం శ్రేయస్కరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..