Watch Video: ప్రమాదకంగా విమానం రెక్కలపై సిబ్బంది డ్యాన్సులు.. స్పందించిన యాజమాన్యం..

|

Aug 30, 2023 | 8:14 PM

ఈ మధ్య సోషల్ మీడియాలోనే ఏదైన కొంచెం వింతగా కనిపిస్తే చాలు.. వెంటనే వైరల్ అయిపోతున్నాయి. లక్షలు, కోట్లల్లో కూడా వ్యూస్ వచ్చేస్తున్నాయి. భాషతో, దేశంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని వైరల్ అయిపోతుంటాయి. మరికొందరు తమ టాలెట్ నిరూపించుకునేందుకు వివిధ రకాల విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో తమకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి చేస్తుంంటారు. ఇందుకోసం ప్రమాదకరమైన విన్యాసాలు చేసేందుకు కూడా వెనకాడరు.

Watch Video: ప్రమాదకంగా విమానం రెక్కలపై సిబ్బంది డ్యాన్సులు.. స్పందించిన యాజమాన్యం..
Cabin Crew
Follow us on

ఈ మధ్య సోషల్ మీడియాలోనే ఏదైన కొంచెం వింతగా కనిపిస్తే చాలు.. వెంటనే వైరల్ అయిపోతున్నాయి. లక్షలు, కోట్లల్లో కూడా వ్యూస్ వచ్చేస్తున్నాయి. భాషతో, దేశంతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని వైరల్ అయిపోతుంటాయి. మరికొందరు తమ టాలెట్ నిరూపించుకునేందుకు వివిధ రకాల విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో తమకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి చేస్తుంంటారు. ఇందుకోసం ప్రమాదకరమైన విన్యాసాలు చేసేందుకు కూడా వెనకాడరు. అయితే ఇప్పుడు తాజాగా ఓ వీడియో వైరలవుతోంది. విమానం రెక్కపై డ్యాన్స్ చేసిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది బుక్కైపోయారు. బోయింగ్ 777 విమానం రెక్కపై వారు డ్యాన్సు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. దీంతో సమాచారం తెలుసుకున్న విమానయాన సంస్థ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైపోయింది.

విమానాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడితే ఏ మాత్రం సహించేది లేదని స్పష్టం చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే బోయింగ్ 777 విమానం ఓ ఎయిర్‌పోర్టులో దిగింది. ఈ క్రమంలోనే ఓ మహిళా సిబ్బంది విమానం రెక్కపై డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత అధికారిగా కనిపిస్తున్న మరో వ్యక్తి కూడా తన బాడీ బిల్డింగులతో పలు పోజులు ఇచ్చాడు. అయితే ఇందుకు సంబంధించినటువంటి దృశ్యాలను విమానం కోసం టెర్మినల్ వద్ద వేచి ఉన్నటువంటి ఓ వ్యక్తి రికార్డు చేశాడు. ఇంకేముంది ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇక ఆ వీడియో వైరల్‌గా మారిపోయింది. చివరికి స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అధికారులు చేరిపోయింది. అయితే ఈ వీడియోపై స్పందించిన అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరో విషయం ఏంటంటే ఈ బోయింగ్ విమానం రెక్క ఐదు మీటర్ల వెడల్పు ఉంది. అలాగే 16.4 మీటర్ల ఎత్తు ఉంది. ఒకవేళ అంతఎత్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోతే తీవ్ర ప్రమాదానికి దారితీస్తుందని ఎయిర్‌పోర్టు యాజమాన్యం పేర్కొంది. ఎయిర్‌పోర్టులో పనిచేసే సిబ్బంది ఇలాంటి వాటికి పాల్పడితే క్షమించే ప్రసక్తే లేదని చెప్పింది. ఇలాంటి సంఘటనలు చూడటానికి సరదాగా అనిపించినా కూడా.. చాలా ప్రమాదమని ఆందోళన వ్యక్తం చెసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..