టిప్‌టాప్‌గా షాప్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.. కట్‌చేస్తే.. కంత్రి బుద్ది చూపించాడు.. షాకింగ్ వీడియో

ఒక వ్యక్తి నగలు కొనేందుకు గోల్డ్‌ షాప్‌కు వచ్చాడు. గోల్డ్ చైన్ చూపించమని షాప్ ఓనర్‌ను అడిగాడు.. అతను కూడా ఒక గొలుసు తీసి ఆ వ్యక్తి ముందు ఉంచాడు.. అతను గొలసును తనిఖీ చేస్తున్నట్టు నటింటి.. క్షణాల్లో అక్కడి నుంచి మాయమయ్యాడు. అది గమనించిన యజమాని దొంగదొంగ అని అరిచేలోపే అతను పారిపోయాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని సదర్ కొత్వాలి ప్రాంతంలో జరగ్గా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

టిప్‌టాప్‌గా షాప్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.. కట్‌చేస్తే.. కంత్రి బుద్ది చూపించాడు..  షాకింగ్ వీడియో
Viral Video

Updated on: Nov 29, 2025 | 6:16 PM

గొలుసు కొంటానని కస్టమర్‌లా షాప్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఒక వ్యక్తి.. యజమాని కళ్లుగప్పి మూడు తులాల బంగారు చైన్ ఎత్తుకెళ్లిన ఘటన సదర్ కొత్వాలి ప్రాంతం వెలుగు చూసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ కెమెరాలోని దృశ్యాల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌ లోని హల్వాయి చౌక్‌లో జుగల్ కిషోర్ ప్రహ్లాది లాల్ అనే నగల దుకాణం ఉంది. శుక్రవారం మధ్యాహ్నం 11:30 గంటల ప్రాంతంలో, నల్ల జీన్స్ ప్యాంట్, నల్ల జాకెట్ ధరించిన ఒక యువకుడు దుకాణానికి వచ్చాడు.

తనకు గోడ్ల్ చైన్ కావాలని మంచి చైన్ చూపించమని షాప్ ఓనర్‌ను అడిగాడు. గొలుసు దాదాపు ఒకటి నుండి ఒకటిన్నర తులాలు ఉండాలని చెప్పాడు. దీంతో ఓనర్ కొన్ని గొలుసుల డిజైన్‌లు తీసి అతని ముందు ఉంచాడు. అంతలోనే వేరే కష్టమర్లు రావడంతో ఓనర్ వాళ్లకు కూడా డిజైన్‌లు చూపించేదుకు కాస్తా పక్కకు వెళ్లాడు. అయితే గోసులను చూస్తున్నట్టు నటించిన ఆ వ్యక్తి.. ఇదే అదునుగా భావించి.. అక్కడున్న మూడు తులాల చైన్‌ను తీసుకొని పారిపోయాడు.

అది గమనించిన ఇతర కస్టమర్లలో ఒక యువకుడు అతన్ను పట్టుకునేందుకు వెంబడే పరుగెత్తాడు. కానీ అతను మార్కెట్‌లోని జనాల్లో కలిసిపోయి అదృశ్యమయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మొత్తం షాప్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో షాప్ ఓనర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ దృశ్యాల అధారంగా దొంగను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.