Viral Spider Bite Story: ఓరీ దేవుడో.. సాలీడు పురుగు కాటుకు గురైన మహిళ.. పాము కుబుసంలా ఒంటిపై చర్మం..

ఒక మహిళను గోధుమ రంగు సాలీడు కరవడంతో ఆమె శరీరం భయంకరంగా మారిపోయింది. గుండె వేగం పెరిగి, ఆక్సిజన్ పడిపోయింది, చివరికి వెంటిలేటర్‌పై ఉంచారు. కోలుకున్నాక చర్మం పాములా ఊడిపోయింది. ఈ షాకింగ్ అనుభవం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాలీడు కాటు ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఆమె తన సోషల్ మీడియా పోస్ట్‌ ద్వారా ప్రపంచానికి తెలియజేసింది.

Viral Spider Bite Story: ఓరీ దేవుడో.. సాలీడు పురుగు కాటుకు గురైన మహిళ.. పాము కుబుసంలా ఒంటిపై చర్మం..
Brown Recluse Spider Bite

Updated on: Dec 19, 2025 | 9:27 PM

ఒక మహిళ షేర్‌ చేసిన భయానక కథ ఒకటి సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇంటర్‌వేదికగా ఇది ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. విషపూరితమైన గోధుమ రంగు సాలీడు కరిచిన తర్వాత ఆ మహిళ పరిస్థితి చాలా క్షీణించి, ఆమె శరీరం మొత్తం ఎలా మారిపోయిందో తెలిస్తే షాకింగ్‌గా అనిపించింది. వారాల తరబడి చికిత్స పొందిన తర్వాత కూడా, ఆ విషం ప్రభావాలు ఆమె శరీరంపై కనిపించాయి. 2025 మే 17న తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని ఇన్‌స్టాగ్రామ్ యూజర్ మైనిటా ఎస్ తన అనుభవాన్ని పంచుకున్నారు. అకస్మాత్తుగా, తనకు తెలియకుండానే ఒక గోధుమ రంగు సింగిల్‌ సాలీడు ఆమెను కరిచింది. దాంతో ఆమెను రెండు వారాల పాటు ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం..

మైనిటా ప్రకారం, ఒక క్షణం ఆమె సాధారణంగా ఉండేది. మరొక క్షణం ఆమె శరీరం కుంచించుకుపోవడం ప్రారంభమైంది. ఆమె నడవలేకపోయింది. తినలేకపోయింది. స్నానం కూడా చేయలేకపోయింది. ఒకానొక సందర్బంలో ఆమె కళ్ళు కూడా తెరవలేకపోయింది. ఆమె హార్ట్‌బీట్‌ రేటు చాలా రోజుల పాటు 140- 160 మధ్య ఉంది. ఆమె ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకరంగా పడిపోయాయి. పరిస్థితి చాలా తీవ్రంగా మారడంతో వైద్యులు ఆమెను వెంటిలేటర్‌పై ఉంచారు. హిమోగ్లోబిన్ స్థాయి వేగంగా పడిపోవడంతో ఆమె పరిస్థితిని మరింత దిగజారిపోయిందని బాధితురాలు మైనిటా చెప్పింది. తన శరీరం అంతర్గతంగా తనకు వ్యతిరేకంగా పోరాడుతోందని, తనకు ఏం జరుగుతుందో తనకే అర్థం కాలేదని చెప్పింది. ఈ సమయంలో,ఆమె చాలా కాలం పాటు తన పరిసరాల గురించి కూడా ఏమీ తెలియని స్థితిలోకి వెళ్లిపోయింది.

అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే, తను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఆ విషం తన శరీరాన్ని ప్రభావితం చేస్తూనే ఉందని మెనిటా చెప్పింది. తన చర్మం పెద్ద పెద్ద ముక్కలుగా ఊడిపోతున్నట్లు కనిపించే వీడియోను కూడా ఆమె షేర్ చేసింది. సాలీడు తనను పాములాగా కుబుసం విడిచే స్థితిలోకి మార్చేసిందని వాపోయింది.

ఇవి కూడా చదవండి

బ్రౌన్ రెక్లూస్ స్పైడర్ ఎంత ప్రమాదకరమైనది?

బ్రౌన్ రెక్లూస్ సాలీడు యునైటెడ్ స్టేట్స్ దక్షిణ, మధ్య ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది సాధారణంగా చీకటి, పొడి, క్లోసెట్‌లు, బేస్‌మెంట్‌లు, స్టోర్‌రూమ్‌లు వంటి మూసివేసిన ప్రదేశాలలో నివసిస్తుంది. దీని శరీరం వయోలిన్ ఆకారపు గుర్తులో ఉంటుంది. ఈ సాలీడు కాటు తొలుత ఎలాంటి నొప్పిలేకుండా ఉంటుంది. కాబట్టి ఎవరూ దీన్ని పెద్దగా పట్టించుకోరు. ఇది తరువాత ప్రాణాంతకంగా మారుతుంది. కొన్ని కేసులలో చర్మం వాపు, నీలం రంగులోకి మారడం, బొబ్బలు, కండరాల నొప్పికి కారణమవుతాయి. తీవ్రమైన కేసులు జ్వరం, వాంతులు, తలతిరగడం, దద్దుర్లు, రక్త సంబంధిత సమస్యలు, అవయవ నష్టానికి కారణమవుతాయి. తక్షణ చికిత్స చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..