
వీధుల్లో కొబ్బరి నీళ్లు అమ్ముతున్న బ్రిటిష్ యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో అతను కొబ్బరిబొండాం కొట్టి హిందీలో మాట్లాడుతుండటం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఆ వీడియో చూసిన తర్వాత అతపే భారతదేశంలోనే ఉన్నాడు అని అనిపించింది. భారతీయ రోడ్ల మాదిరిగానే అతను కత్తితో కొబ్బరిబొండాం కొట్టి నీళ్లు అమ్ముతున్నాడు. ఇందుకోసం కారు వెనుక భాగంలో ప్రత్యేక సెటప్ ఏర్పాటు చేసుకున్నాడు. పైగా అతను కొబ్బరి నీళ్లు తాగాలంటూ..ప్రజల్ని హిందీలో పిలుస్తున్నాడు. అతను గట్టి గట్టిగా అరుస్తూ..రండి రండి.. నారియల్‌కా పానీ పీలో.. అంటూ కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేశాడు.
వీడియో ప్రారంభంలో అతను ఒక వ్యక్తికి కొబ్బరి నీళ్లు ఇస్తాడు. ఆ వెంటనే మరింత మంది ప్రజల్ని పిలవడానికి, కొబ్బరి నీళ్లు తాగండి అంటూ పిలుస్తున్నాడు. అతను కొబ్బరిబొండాంలో కొంతభాగాన్ని కట్ చేసి.. ఆ రంధ్రంలో స్ట్రా వేసి కస్టమర్‌కి అందిస్తున్నాడు. భారతీయ దుకాణదారులు తమ ప్రత్యేక లయలో కస్టమర్లను పిలిచినట్లుగానే, ఈ బ్రిటిష్ యువకుడు కూడా “జల్దీ జల్దీ (త్వరగా)” అని చెబుతున్నాడు.. ఇది కూడా వీడియోలో చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంది.
వీడియో ఇక్కడ చూడండి..
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోను 11 లక్షలకు పైగా వీక్షించారు. దీనికి 44,000 కంటే ఎక్కువ లైక్‌లు కూడా వచ్చాయి. ఈ వీడియోను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. ఇప్పుడు బ్రిటిష్ వారు కూడా హిందీ నేర్చుకుంటున్నారని చాలా మంది సరదాగా అన్నారు. మరొక ఫన్నీగా వ్యాఖ్యనిస్తూ.. అతనికి ఆధార్ కార్డు ఉందో లేదో తెలుసుకోండి.. అంటూ పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..