విమానం గాల్లో ఉండగా.. బిజినెస్‌ క్లాస్‌ వాష్‌రూమ్‌లో..! ఊహించని పని చేస్తూ పట్టుబడిన సిబ్బంది

శాన్ ఫ్రాన్సిస్కో నుండి లండన్ హీత్రూకు వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో ఓ స్టీవార్డ్ డ్రగ్స్ సేవించి బిజినెస్ క్లాస్ టాయిలెట్లో నగ్నంగా నృత్యం చేశాడు. ఇతని వింత ప్రవర్తన చూసి సిబ్బంది షాక్ అయ్యారు. విమానంలోని 470 మంది ప్రయాణికులకు భోజనం సరఫరా చేయాల్సిన ఇతను కనిపించకపోవడంతో అతన్ని వెతికి బట్టలు విప్పి డ్యాన్స్ చేస్తుండగా పట్టుకున్నారు.

విమానం గాల్లో ఉండగా.. బిజినెస్‌ క్లాస్‌ వాష్‌రూమ్‌లో..! ఊహించని పని చేస్తూ పట్టుబడిన సిబ్బంది
British Airways

Edited By: Ravi Kiran

Updated on: May 31, 2025 | 5:17 PM

శాన్ ఫ్రాన్సిస్కో నుండి లండన్ హీత్రూకు వెళ్తున్న బ్రిటీస్‌ ఎయిర్‌ వేస్‌ విమానంలో ఊహించని ఘటన ఒకటి చోటు చేసుకుంది. విమానంలోని బిజినెస్ క్లాస్ టాయిలెట్‌లో ఓ వ్యక్తి బట్టల్ని విప్పి డ్యాన్స్‌ చేస్తూ కనిపించాడు. అది చూసి మిగతా సిబ్బంది షాక్‌ అయ్యారు. ఇంతకీ ఆ వ్యక్తి అలా ఎందుకు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం.. విమానంలో 470 మంది ప్రయాణికులు ఉన్నారు. వారికి భోజనం సప్లైయ్‌ చేయాల్సిన వ్యక్తి, భోజన సేవ సమయంలో కనిపించకుండా పోయాడు. దీంతో మిగిలిన సిబ్బంది అతన్ని వెతికే పనిలో పడ్డారు.

విమానమంతా గాలించగా.. బిజినెస్‌ క్లాస్‌లోని వాష్‌ రూమ్‌లో తీరిగ్గా పట్టలన్ని విప్పి డ్యాన్స్‌ చేస్తూ కనిపించాడు. ఆ సమయంలో అతను డ్రగ్స్‌ తీసుకొని ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. అతన్ని పట్టుకొని.. ఓ చోట కూర్చోబెట్టారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే, పోలీసులు అతన్ని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఎయిర్‌బస్ A380 విమానంలో దాదాపు 470 మంది ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రగ్స్‌ మత్తులో పిచ్చిగా ప్రవర్తించిన స్టీవార్డ్‌ను సస్పెండ్ చేసినట్లు బ్రిటిష్ ఎయిర్‌వేస్ వెల్లడించింది. ఈ విషయం ఇప్పుడు పోలీసు దర్యాప్తులో ఉందని పేర్కొంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి