Viral video: హల్దీ వేడుకల్లోకి డైనోసోర్.. గెటప్‌ తీసి చూడగా ఆశ్చర్యపోయిన అతిథులు!

హల్దీ వేడుక అంటే తెలుసు కదా సాధారణంగా ఇది పెళ్లికి ముందు జరుపుకునే కార్యక్రమం.. అయితే న్యూఢిల్లీకి చెందిన ఓ జంటకు ఇటీలవే పెళ్లి కుందిరింది. పెళ్లి వేడుకల్లో భాగంగా ముందు హల్దీ కార్యక్రమం జరిగింది. అయితే పెళ్లికూతురు పెద్ద డైనోసోర్ కాస్ట్యూమ్‌లో అక్కడి ఎంట్రీ ఇచ్చి వరుడితో పాటు అతిథులందినీ అశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Viral video: హల్దీ వేడుకల్లోకి డైనోసోర్.. గెటప్‌ తీసి చూడగా ఆశ్చర్యపోయిన అతిథులు!
Haldi Ceremony

Updated on: Apr 29, 2025 | 8:02 AM

హల్దీ వేడుక అంటే తెలుసు కదా సాధారణంగా ఇది పెళ్లికి ముందు జరుపుకునే కార్యక్రమం.. అయితే న్యూఢిల్లీకి చెందిన ఓ జంటకు ఇటీలవే పెళ్లి కుందిరింది. పెళ్లి వేడుకల్లో భాగంగా ముందు హల్దీ కార్యక్రమం జరిగింది. సాధారణంగా పెళ్లికి ముందు ప్రత్యేకంగా జరుపుకునే ఈ హల్దీ వేడుకలో ఇరు కుటుంబాల బంధువులు రకరకాల ఆటలు ఆడుతూ సరదాగా సంబరాలు చేసుకుంటారు. ఇందులో భాగంగానే వధూవరులు కొన్నిసార్లు ప్రత్యేక గెటప్‌లలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. అయితే ఇక్కడ జరిగిన హల్దీ వేడుకలో కూడా అలాంటి ఘటనే జరిగింది. ఈ హల్దీ వేడుకకు వచ్చిన పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో సహా అతిథులందినీ ఆశ్చర్యపరిచంది.

అయితే అక్కడ హల్దీ వేడుక జరుతుంది. ఈ వేడుకకు పెళ్లి కొడుకు, అతని బంధువలు, పెళ్లి కూతురు అతని బంధువులతో సహా అందరూ వచ్చారు. కానీ ఇంకా పెళ్లి కూతురు రాలేదు. అయితే పెళ్లి కూతురు కోసం అక్కడ ఉన్న వారంతా ఎదురుచూస్తున్నారు. అయితే అప్పుడు ఒక పెద్ద డైనోసోర్‌ కాస్ట్యూమ్‌లో ఓ వ్యక్తి అక్కడి వచ్చి అతిథులందరినీ పలకరించింది.  అతిథులందరూ ఈ డైనోసొర్ ఎవరబ్బా అని గెటప్‌ తీసి చూస్తే అక్కడ పెళ్లి కూతురు ఉంది. దీంతో అమెను చూసిన పెళ్లి కొడుకుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఇక వరుడు ఆ డైనోసోర్ గెటప్‌లో ఉన్న వధువుతో కలిసి డాన్స్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. నేను ఈ వారంలో చూసిన వాటిల్లో ఇదే అత్యంత ఫన్నీ విషయం అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరి కొందరూ ఆమె గాడ్జిల్లా కాదు బ్రైడ్జిల్లా అని కామెంట్స్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…