ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ల వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పెళ్లి అంటేనే సందడి. ప్రతీ ఒక్కరూ పెళ్లిలో జరిగే మూమెంట్స్ అన్నింటిని క్యాప్చర్ చేసుకుంటారు. ఇక అలాంటి ఓ పెళ్లి వీడియో గురించి మాట్లాడుకుందాం. ఇందులో వధువు చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారింది. అయితే వధువు డ్యాన్స్ చేసింది వరుడుతో కాదు.. ఆమె తండ్రితో.. వధువుతో పాటు ఆమె తండ్రి సంగీత్ వేడుకలో చేసిన అదిరిపోయే డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తన ముద్దుల కూతురుతో తండ్రి సంతోషంగా, హుషారుగా వేసిన స్టెప్పులు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ తండ్రీకూతుళ్ల డ్యాన్స్ మనసులను హత్తుకునే విధంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. కాగా ఈ వేడుక ఎక్కడ జరిగిందో.? ఏంటి.? అనే వివరాలు ఏమి తెలియవు. ‘వెడ్‌గోఈజీ’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ దీనికి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. క్షణాల్లో వైరల్‌గా మారింది.