Viral Video: మొసలిపై కూర్చుని సవారీ చేస్తోన్న కొంగ.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!

Crane Rides Crocodile: మొసలిని చూస్తే ఎవరైనా భయపడతారు. సాధారణంగా మొసలి నీటితో ఉంటే.. దానికి వెయ్యి ఏనుగుల బలం ఉన్నట్లే. ఏ జంతువు అయినా కూడా దానికి..

Viral Video: మొసలిపై కూర్చుని సవారీ చేస్తోన్న కొంగ.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!
Crocodile

Updated on: Jun 24, 2021 | 12:20 PM

మొసలిని చూస్తే ఎవరైనా భయపడతారు. సాధారణంగా మొసలి నీటితో ఉంటే.. దానికి వెయ్యి ఏనుగుల బలం ఉన్నట్లే. ఏ జంతువు అయినా కూడా దానికి ఆహారం కావాల్సిందే. అయితే ఇక్కడో కొంగ మాత్రం మొసలిని చూసి భయపడలేదు. ఏకంగా దాని మీద ఎక్కి మరీ సవారీ చేసింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ కొంగ ధైర్యంగా మొసలిపై సవారీ చేయడాన్ని మీరు చూడవచ్చు. బ్యాలెన్స్ ఎక్కడా కూడా తప్పకుండా ‘సముద్రపు అలెగ్జాండర్’పై రైడ్ చేస్తుంది. ఇంతలో ఊహించని విధంగా మరో రెండు మొసళ్లు కూడా దాని పక్కనే ఈడుతుంటాయి. మొసలి కూడా కొంగపై ఎటాక్ చేయడానికి ఎక్కడా ప్రయత్నించదు. చూస్తుంటే ఇద్దరూ స్నేహితుల మాదిరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ మొసలి కొంగను జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకొస్తుంది. ఈ వైరల్ వీడియో ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. దీనిని చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. కొంగ ధైర్యాన్ని ఒకరు మెచ్చుకుంటూ కామెంట్ చేయగా.. మొసలి, కొంగ మధ్య స్నేహం చూడముచ్చటగా ఉందని మరొకరు కామెంట్ చేస్తున్నారు.

Also Read:

Viral Video: అందంతో చంపుతున్న సొట్టబుగ్గల సుందరి.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో.!

Viral Video: ఆఫ్రికన్ పైథాన్‌తో తల్లి చిరుత ఫైట్.. అది చేసిన పనికి నెటిజన్లు సలామ్.. వైరల్ వీడియో!

సెహ్వాగ్, డివిలియర్స్ స్టైల్‌లో.. 17 బంతుల్లో 76 పరుగులు.. బౌలర్లకు చుక్కలే చుక్కలు!

Follow Us