Photo Puzzle: కిర్రాక్ పజిల్.. కేవలం 10 సెకన్లలో ఈ లెక్కను సాల్వ్ చేయగలరా.?

ఆఫీస్ వర్క్ నుంచి కొంచెం ఫ్రీ టైం దొరికినా.. లేదా ఏదైనా జర్నీ చేసేటప్పుడు.. చూసే సినిమా బోర్ కొట్టినా చాలు.. చాలామంది సోషల్ మీడియాను అతుక్కుపోతున్నారు. ఇలానే కాదండోయ్.. వర్క్ నుంచి కాసేపు స్పేస్ తీసుకుని మరీ నెట్టింట చక్కర్లు కొట్టేవాళ్లు ఎందరో ఉన్నారు.

Photo Puzzle: కిర్రాక్ పజిల్.. కేవలం 10 సెకన్లలో ఈ లెక్కను సాల్వ్ చేయగలరా.?
Photo Puzzle

Updated on: Apr 11, 2024 | 4:26 PM

ఆఫీస్ వర్క్ నుంచి కొంచెం ఫ్రీ టైం దొరికినా.. లేదా ఏదైనా జర్నీ చేసేటప్పుడు.. చూసే సినిమా బోర్ కొట్టినా చాలు.. చాలామంది సోషల్ మీడియాను అతుక్కుపోతున్నారు. ఇలానే కాదండోయ్.. వర్క్ నుంచి కాసేపు స్పేస్ తీసుకుని మరీ నెట్టింట చక్కర్లు కొట్టేవాళ్లు ఎందరో ఉన్నారు. ఇక టైంపాస్ కోసం ఇంటర్నెట్‌లో లెక్కకు మించిన కంటెంట్ ఉంటుంది. ఫన్నీ వీడియోలు, క్యూట్ వీడియోలు.. అలాగే సృజనాత్మక వీడియోలు.. అంతేకాదు మన మెదడుకు మేత వేసే పలు ఫోటో పజిల్స్.. కూడా తెగ ట్రెండ్ అవుతుంటాయి. సరే సోది అంతా పక్కన పెడితే.. ఇప్పుడు ఫోటో పజిల్స్ మన మెయిన్ టాపిక్.

ఈ పజిల్స్ మనలోని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతాయి. కొందరు వీటిని ఓ పట్టు పట్టేదాకా నిద్రపోరు. ఇలాంటి గజిబిజి ఫోటో పజిల్స్.. మనల్ని తికమకపెడతాయి. పైన ఫోటో కూడా కాస్త ఇంచుమించుగా అలాంటిదే. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మీకు అగ్గిపుల్లలతో చేసిన ‘508’ నెంబర్ కనిపిస్తోంది కదూ..! కరెక్టే.. అయితే ఇప్పుడు అసలైన ట్రిక్కి పజిల్ ఏంటంటే.. ఆ అగ్గిపుల్లలలో నుంచి రెండింటిని మాత్రమే జరిపి.. ఓ పెద్ద నెంబర్‌ను చేయాలి. దాదాపుగా ఆ నెంబర్ 1000 పైన ఉండాలి. మరి లేట్ ఎందుకు ఓసారి ప్రయత్నిస్తారా.? మీలో దమ్ముంటే.. బుర్రకు పదునెక్కువైతే.. కేవలం 10 సెకన్లలోనే ఈ లెక్కను ఓ పట్టు పట్టండి.. ఎంతసేపు చూసినా మీకు సమాధానం దొరక్కపోతే.. కింద ఫోటో చూడండి..

 

Post by @jashanmundi
View on Threads