Viral Video: వీధి కుక్కకోసం ప్రాణాలకు తెగించిన ఇద్దరు చిన్నారులు .. సూపర్‌ హీరోస్‌ అంటున్న నెటిజన్లు..

|

Aug 04, 2023 | 2:17 PM

డ్యూటీలో ఉన్న ఓ ట్రాఫిక్ పోలీసు వర్షం కురుస్తున్న రోజు కోల్‌కతా వీధుల్లో వీధికుక్కలతో కలిసి ఒకే గొడుగు కింద డ్యూటీ చేస్తూ కనిపించాడు. ఈసారి, ఇద్దరు బాలురు మోకాళ్ల లోతు నీటిలో నడుస్తూ భయం భయంగా ఆ కుక్కను కాపాడేందకు వెళ్తున్న దృశ్యం.. అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు.

Viral Video: వీధి కుక్కకోసం ప్రాణాలకు తెగించిన ఇద్దరు చిన్నారులు .. సూపర్‌ హీరోస్‌ అంటున్న నెటిజన్లు..
Boys Save Terrified Dog
Follow us on

సోషల్ మీడియాలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వస్తున్నాయి. జంతువులు, పక్షుల నుండి మానవులు చేసే వివిధ విన్యాసాలు కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొన్నిసార్లు అలాంటి వీడియోలు ప్రేక్షకులను ఆందోళనలో పడేస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. డ్రెయిన్ పక్కన ఇరుక్కుపోయిన వీధి కుక్కను రక్షించేందుకు ఇద్దరు పిల్లలు ప్రాణాలకు తెగించారు. ఇద్దరు చిన్నారులు ఆ మూగజీవిని రక్షించిన వీడియో నెట్‌లో వైరల్‌గా మారింది . arya_vamshi17 అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా వీడియో షేర్ చేయబడింది. వీడియోలో అక్కడంతా మురుగు కాల్వ నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కాల్వకు ఓవైపున ఒక వీధి కుక్క ఇరుక్కుపోయింది. డ్రెయిన్ గోడ అంచు దగ్గర ఓ చిన్న గట్టులాంటి ఒడ్డుపై నిలబడి ఉంది. పాపం ఆ మూగజీవి భయంతో వణికిపోతుంది. వీధి కుక్కను గమనించిన ఆ ఇద్దరు బాలురు మోకాళ్ల లోతు నీళ్లలో జాగ్రత్తగా కుక్కను రక్షించేందుకు వెళ్లారు.

యాదృచ్ఛికంగా, చాలా రోజుల క్రితం రతన్ టాటా వర్షాకాలంలో వీధి కుక్కల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డ్యూటీలో ఉన్న ఓ ట్రాఫిక్ పోలీసు వర్షం కురుస్తున్న రోజు కోల్‌కతా వీధుల్లో వీధికుక్కలతో కలిసి ఒకే గొడుగు కింద డ్యూటీ చేస్తూ కనిపించాడు. ఈసారి, ఇద్దరు బాలురు మోకాళ్ల లోతు నీటిలో నడుస్తూ భయం భయంగా ఆ కుక్కను కాపాడేందకు వెళ్తున్న దృశ్యం.. అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు.

ఇవి కూడా చదవండి

వైరల్‌ వీడియో క్యాప్షన్‌కు ఇద్దరు చిన్నారులను ‘సూపర్ హీరోస్’గా పేర్కొన్నారు. ఈ వైరల్‌ వీడియోని షేర్‌ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే 7 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో చూసిన చాలా మంది స్పందించారు. ఇలాంటి సందర్బాల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మానవత్వం నేర్పించాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. నోరు లేని జంతువులతో ఎలా వ్యవహరించాలో నేర్పించాలంటున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేక గ్రామాలు, ఊళ్లు నీట మునిగాయి. ప్రజల ఆస్తులు, అనేక జంతువులు సైతం వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. వందల ఎకరాల్లో పంటలు సైతం నీటి ప్రవాహంలో కలిసిపోయాయి. పంటలు, పెంచుకున్న మూగజీవాలు వరదల్లో కొట్టుకుపోవటంతో అనేక మంది రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..