Viral Video: పని చేస్తున్న ఫోన్‌ని రాయితో కొట్టిన యువకుడు.. యాక్షన్‌కి రియాక్షన్ ఫన్నీ వీడియో వైరల్

|

May 20, 2022 | 9:18 AM

ఓ యువకుడు.. తన స్మార్ట్‌ ఫోన్‌ తనను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందో తెలియదు గానీ... చక్కగా పని చేస్తున్న తన ఫోన్‌ తీసుకెళ్లి బండరాయిమీద పెట్టి రాయితో కొట్టాడు. గ్లాస్‌ పగిలింది. అక్కడితో ఆగలేదు మరోసారి కొట్టాడు.

Viral Video: పని చేస్తున్న ఫోన్‌ని రాయితో కొట్టిన యువకుడు.. యాక్షన్‌కి రియాక్షన్ ఫన్నీ వీడియో వైరల్
Viral Video
Follow us on

Viral Video: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ ఫోన్‌ (Smart Phone) మనిషి జీవితంలో భాగమైపోయింది. తినకుండా అయినా ఉంటామెమో కానీ ఫోన్ లేకుండా జీవించి ఉండలేము అనే స్టేజ్ కు చేరుకున్నారు. ఉదయం లేచిన వెంటనే ముందుగా వెదుకు కునేది తమ ఫోన్ ఎక్కడ ఉందా అని… ఉదయం నుంచి రాత్రి పడుకోబోయే ముందు వరకూ సెల్‌ ఫోన్‌(Cell Phone) లేనిదే రోజు గడవని పరిస్థితి. ఇప్పుడు లైఫ్‌ స్టైల్‌ చాలా స్మార్ట్‌గా మారిపోయింది. నేటి యువత ప్రధానంగా సెల్ ఫోన్ లను, టెక్నాలజీని ఒక రేంజ్ లో ఉపయోగించుకుంటున్నారు. కంపెనీలు కూడా మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టుగా కొత్త కొత్త అప్లికేషన్లను అందుబాటులోనికి తెస్తున్నాయి. దీన్ని ఉపయోగించి యూత్.. టెక్నాలజీ రంగంలో ముందుకు దూసుకుపోతున్నారు.

ఇదిలా ఉంటే ఇక్కడ ఓ యువకుడు.. తన స్మార్ట్‌ ఫోన్‌ తనను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందో తెలియదు గానీ… చక్కగా పని చేస్తున్న తన ఫోన్‌ తీసుకెళ్లి బండరాయిమీద పెట్టి రాయితో కొట్టాడు. గ్లాస్‌ పగిలింది. అక్కడితో ఆగలేదు మరోసారి కొట్టాడు. ఈసారి ఫోన్‌లోంచి మంటలు చెలరేగాయి. వెంటనే యువకుడు ఫోన్ ను వదిలేసి అక్కడి నుంచి భయంతో దూరంగా పారిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీయో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఏమైందిరా నీకు… ఆ ఫోన్‌ ఏం చేసింది నిన్ను.. నువ్వు ఎట్లా వాడితో గట్లనే పన్జేస్తది.. ఫోన్‌ పగలగొడ్తే ఏమొస్తది అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..