Video Viral: చిన్నారిని రెస్టారెంట్ బిల్లు కట్టమన్న తండ్రి.. మనసు దోచుకుంటున్న చిన్నారి సమాధానం.. ఆపై ఏం జరిగిందంటే

|

Aug 09, 2022 | 6:37 PM

మొక్కై వంగనిదే మానై వంగునా.. అనేది సామెత. అందుకు తగ్గట్టే చిన్నారుల్లో మంచి భావనలను అలవరిచి వారు సమాజానికి దోహదకారిగా పని చేసేలా మార్పు కలిగించాలి. చిన్న పిల్లల్లో సంస్కారం, వ్యవహారశైలి పెద్దల పెంపకాన్ని బట్టి వస్తుంది. చిన్నారుల‌కు...

Video Viral: చిన్నారిని రెస్టారెంట్ బిల్లు కట్టమన్న తండ్రి.. మనసు దోచుకుంటున్న చిన్నారి సమాధానం.. ఆపై ఏం జరిగిందంటే
Boy Paying Bill
Follow us on

మొక్కై వంగనిదే మానై వంగునా.. అనేది సామెత. అందుకు తగ్గట్టే చిన్నారుల్లో మంచి భావనలను అలవరిచి వారు సమాజానికి దోహదకారిగా పని చేసేలా మార్పు కలిగించాలి. చిన్న పిల్లల్లో సంస్కారం, వ్యవహారశైలి పెద్దల పెంపకాన్ని బట్టి వస్తుంది. చిన్నారుల‌కు ఎంత మంచి పెంప‌కాన్ని అందిస్తే వారు అంతగా పరిణతి చెందుతారు. సోషల్ మీడియా (Social Media) లో అందుకు సంబంధించిన వీడియోలు నిత్యం ఎన్నో పోస్ట్ అవుతూ ఉంటాయి. ఇవి ఆశ్చర్యం కలిగిస్తే మరికొన్ని మాత్రం ఔరా అనిపిస్తాయి. ప్రస్తుతం వైరల్ (Viral) అవుతున్న ఈ వీడియోలో ఓ తండ్రి, తన కుమారుడితో కలిసి భోజనం చేసేందుకు రెస్టారెంట్‌కు వెళ్తాడు. అక్కడ భోజ‌నం చేసిన త‌ర్వాత బిల్లు చెల్లించాల‌ని తండ్రి కుమారుడిని కోరతాడు. ఆ సమయంలో ఆ బుడ‌త‌డు ఇచ్చిన రియాక్షన్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బిల్లును కొడుకు చేతికి అందించ‌గానే చిన్నారి కొద్దిసేపు అయోమయంగా చూస్తాడు. ఆపై బిల్లును నువ్వే కట్టాలి..నీ ద‌గ్గర డ‌బ్బులు ఉన్నాయా అని తండ్రి అడిగాడు. అందుకు బాలుడు నిజాయతీతో కూడిన రియాక్షన్ ఇచ్చాడు. అదిచూసి తండ్రి బిగ్గర‌గా న‌వ్వి, తాను జోక్ చేశాన‌ని చిన్నారితో చెప్తాడు.

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో పోస్ట్ అయింది. క్లిప్ ను మిలియన్‌ మంది వీక్షించగా లక్షల్లో లైక్‌ చేస్తున్నారు. చిన్నారి రియాక్షన్‌కు ఫిదా అవుతూ వేలల్లో కామెంట్లు చేస్తున్నారు. డ‌బ్బు లేక‌పోయినా బిల్లు చెల్లించేందుకు చిన్నారి చూపిన నిజాయితీ ఆక‌ట్టుకుంద‌ని ఓ యూజ‌ర్ వ్యాఖ్యానించ‌గా, అంద‌మైన హృద‌యం క‌లిగిన అంద‌మైన బాలుడ‌ని మ‌రో నెటిజ‌న్ కామెంట్ చేశాడు. ఈ వీడియోను తాము చూడటమే కాకుండా తెలిసిన వారికి, బంధువులు స్నేహితులకు షేర్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..