కొన్ని చోట్ల పెట్రోల్ బంకుల్లో బాటిళ్ళలో పెట్రోల్ ఇవ్వరు. అందుకు తగ్గట్టుగా అక్కడ ప్లకార్డులు కూడా అతికిస్తారు. అయితే కొంతమందికి పెట్రోల్ చాలా అవసరం కావొచ్చు. మేబి.. బండి మధ్యలో ఆగిపోయి.. తోసుకురాలేక.. బాటిల్‌లో పెట్రోల్ అడగవచ్చు. ఇక్కడ ఓ కుర్రాడు కూడా బాటిల్‌లో పెట్రోల్ అడిగేందుకు బంక్‌కు వచ్చాడు. అక్కడ బాటిల్‌లో పెట్రోల్ ఇవ్వడం లేదనే బోర్డు చూశాడు. మనోడికి పెట్రోల్ బాగా అవసరం అనుకుంటే.. ఇలా వినూత్న రీతిలో పెట్రోల్ పోయించుకున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ పెట్రోల్ బంక్‌లో.. పెట్రోల్ బాటిల్‌లో ఇవ్వడం లేదని తెలుసుకుని ఓ కుర్రాడు ఏకంగా తన సైకిల్ క్యారియర్‌పై వాహనానికి సంబంధించిన పెట్రోల్ ట్యాంక్‌ను తీసుకొచ్చాడు. ఇందులో పెట్రోల్ పోయమని అక్కడున్న సిబ్బందిని అడిగారు. ముందుగా వారు దాన్ని చూసి ఆశ్చర్యపోగా.. ఆ తర్వాత అందులో పెట్రోల్ పోసి కుర్రాడిని పంపించారు. ఇక ఇదంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయగా.. నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. లేట్ ఎందుకు మీరూ చూసేయండి.
और न दो बोतल में पेट्रोल…pic.twitter.com/2N6nJ8RH96
— Raajeev Chopra (@Raajeev_Chopra) July 29, 2022