Viral Video: గ్రిల్స్‌ మధ్య ఇరుక్కుపోయిన కుర్రాడి తల.. చివరకు ఎలా బయటపడ్డాడో వీడియో చూడండి..

రెండు సన్నని ఇనుప రాడ్ల మధ్యలో బాలుడి తల ఇరుక్కుపోయి అవస్థపడుతున్నాడు. దాంతో బాలుడిని బయటకు తీసేందుకు అందరూ తెగ తంటాలు పడుతున్నారు.

Viral Video: గ్రిల్స్‌ మధ్య ఇరుక్కుపోయిన కుర్రాడి తల.. చివరకు ఎలా బయటపడ్డాడో వీడియో చూడండి..
Boy

Updated on: Aug 16, 2022 | 12:33 PM

Viral Video: పిల్లలు చేసే అల్లరి మామూలుగా ఉండదు.. కొంతమంది పిల్లలు అతిగా అల్లరి చేస్తుంటారు. అది పాఠశాల అయినా, ఇల్లు అయినా సరే. ఎక్కడైనా పిల్లల అల్లరికి హద్దు అన్నదే ఉండదు..ఎక్కడికెళితే అక్కడ ఆటపాటలు, అల్లరి పనులతోనే గడిపేస్తుంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో వారి అల్లరి పెద్దలకు తలనొప్పిగా మారుతుంటాయి. ఒక్కో సారి వాళ్లు చేసే అల్లరి పనుల కారణంగా ప్రమాదాల బారినపడుతుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తాజా వీడియోలోనూ అలాంటి ఘటనే చోటు చేసుకుంది. అక్కడందరూ స్కూల్‌ పిల్లలే కనిపిస్తున్నారు. వారిలో ఒకడు చాలా అల్లరి చేయడం వీడియోలో చూడొచ్చు. రెండు సన్నని ఇనుప రాడ్ల మధ్యలో బాలుడి తల ఇరుక్కుపోయి అవస్థపడుతున్నట్టుగా మనం వీడియోలో చూడొచ్చు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పిల్లవాడు రాడ్‌కు మధ్య కనిపించే గ్యాప్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించి, ఆ రెండింటి మధ్యలో ఇరుక్కుపోయాడు. దాంతో అతడు బయటపడలేక అవస్థలు పడుతున్నాడు. బయటకు వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. అందరూ ఎంతగానో ప్రయత్నించి ఎట్టకేలకు బాలుడిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. ఎలాంటి గాయాలు లేకుండా బాలుడు బయటకు రావటంతో అక్కడివారంతా ఊపిరి పీల్చుకున్నారు.

సక్త్‌లాగ్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియో అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్ కూడా వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి