Viral: మూర్చబోయిన బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. స్కాన్ చేసి బిత్తరపోయిన వైద్యులు

|

Sep 05, 2024 | 1:20 PM

ఈ మధ్యకాలం యువతపై సోషల్ మీడియా ప్రభావం బాగా పడింది. వింత ఛాలెంజ్‌లు, విపరీత పోకడలతో చాలామంది పిల్లలు తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది.

Viral: మూర్చబోయిన బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. స్కాన్ చేసి బిత్తరపోయిన వైద్యులు
Operation
Follow us on

ఈ మధ్యకాలం యువతపై సోషల్ మీడియా ప్రభావం బాగా పడింది. వింత ఛాలెంజ్‌లు, విపరీత పోకడలతో చాలామంది పిల్లలు తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. సోషల్ మీడియాలోని ఓ ఛాలెంజ్.. 12 ఏళ్ల బాలుడికి ప్రాణ సంకటంగా మారింది. క్రోమింగ్ ఛాలెంజ్‌లో భాగంగా విపరీతంగా పెర్ఫ్యుమ్ పీల్చి.. గుండెపోటుకు గురయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్‌లోని సౌత్‌ యార్క్‌షైర్‌కు చెందిన 12 ఏళ్ల బాలుడు ఇంట్లోనే ఒక్కసారిగా మూర్చబోయి కుప్పకూలిపోయాడు. తన గదిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ.. వణికిపోతూ కుప్పకూలిన అతడ్ని చూసిన తల్లి.. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో పలుసార్లు మూర్ఛ, గుండెపోటుకు గురయ్యాడు సదరు 12 ఏళ్ల బాలుడు. ఇక చివరికి బాలుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. సదరు బాలుడు ఇలా అవ్వడానికి కారణం క్రోమింగేనని వైద్యులు, పోలీసులు నిర్ధారించారు.

అసలు ఇంతకీ క్రోమింగ్ ఏంటి.?

పెయింట్‌, పెట్రోల్‌, నెయిల్‌ పాలీష్‌, ఫ్లోర్‌ క్లీనింగ్‌ ఉత్పత్తులకు సంబంధించి ప్రమాదకర రసాయనాలను పీల్చడాన్ని క్రోమింగ్ అని అంటారు. దీని వల్ల మాటలో తడబాటు, మైకం, భ్రాంతి, వికారం వంటి లక్షణాలు కలుగుతాయి. గుండెపోటు, మూర్చ లాంటి వ్యాధులకు కూడా దారి తీసే ప్రమాదం ఉంది.