ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లోని నదికి సమీపంలో ఒక మహిళ తల లేని మృతదేహం కనిపించింది. కొద్దిదూరంలో నీటిలో తేలియాడుతూ 7 ఏళ్ల చిన్నారి మృతదేహం కనిపించింది. వీరిద్దరికీ బంధుత్వం ఉండే అవకాశం ఉందని, బహుశా తల్లీకొడుకు అయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి, వారి ఎవరు అనేది పోలీసు అధికారులు గుర్తించలేదు. చాలా రోజులుగా అక్కడ కనిపించిన మృతదేహాలు నేరం జరిగిన పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో సంఘటన స్థలానికి పోలీసు అధికారులు, ఫోరెన్సిక్ విభాగం సభ్యులు పరిశీలిస్తున్నారు. అక్కడ తల, తల లేని శరీరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో స్థానిక పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. మహిళ, బిడ్డ ఇద్దరి మృతదేహాలను అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలు, సమయాన్ని గుర్తించేందుకు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ విషాద సంఘటన చుట్టూ ఉన్న పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు.ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి హత్యలు, నేరాలు ఎక్కువ జరుగుతాయి. అక్కడ ప్రభుత్వం కఠిన చట్టాలు తెచ్చినా, శిక్షలు వేసిన నేరస్తులకు భయం లేకుండా పోయింది.
मुरादाबाद, यूपी में नदी किनारे एक महिला की सिर कटी लाश मिली। इससे थोड़ी दूरी पर ही 7 साल के बच्चे की लाश बहती हुई मिली है। आशंका है कि ये दोनों मां-बेटा हो सकते हैं। फिलहाल पहचान नहीं हो सकी है। लाश कई दिन पुरानी हैं। pic.twitter.com/Lk5Uw2U1jE
— Sachin Gupta (@SachinGuptaUP) October 17, 2024